ఎప్పుడో ఊహించని ప్రాంతంలో… ఊహించని ధరతో… భారత బిస్కెట్ బ్రాండ్ ఒకటి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. భారతదేశంలో చిల్లర ధరకు లభించే పార్లే-జీ బిస్కెట్ల ప్యాకెట్, గాజాలో ప్రస్తుతం రూ.2,000కి పైగా అమ్ముడవుతోందంటే విశ్వసించడం కష్టం. యుద్ధ తీవ్రత, ఆహార కొరత కారణంగా అక్కడి బ్లాక్ మార్కెట్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి.
ఇటీవల ఒక పాలస్తీనా వ్యక్తి తన పిల్లల కోసం పార్లే-జీ టిన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “నా కుమార్తె రఫీఫ్‌కి ఇష్టమైన బిస్కెట్లను కొనాలన్నదే నా లక్ష్యం. వాటి ధర అంత అధికంగా ఉన్నా, కాదనలేకపోయాను” అంటూ భావోద్వేగంగా తెలిపారు. పార్లే బ్రాండ్ పై ముద్ర ఉన్న ప్యాకెట్ ఫొటోతో పాటు షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది.
పదార్థాల ధరలు నైరుతి గాజాలో మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మార్కెట్‌లో కిలో చక్కెర రూ. 4,900, వంట నూనె రూ. 4,100, ఉల్లిపాయలు రూ. 4,400కి చేరినాయి. మానవతా సహాయం తగ్గిపోయిన నేపథ్యంలో, కొన్ని వర్గాల చేతుల్లోకి సరఫరా చేరడంతో బ్లాక్ మార్కెట్ బాగా విస్తరించింది. ప్రజలు తమ ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో, చిన్న చిరుతిండ్ల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది.
ఇజ్రాయెల్ దిగ్బంధన, హమాస్ హస్తక్షేపం, అంతర్జాతీయ మానవతా సహాయం నిలిచిపోవడం వల్ల గాజాలో చిన్న వస్తువులు కూడా లక్షలు పలికే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో, ఒక నాసిరకం బిస్కెట్ ఇప్పుడు ఓ విలాస వస్తువుగా మారిపోయింది.
This post was last modified on June 6, 2025 7:48 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…