Trends

ఆ మహిళా ఎంపీతో క్రికెటర్ ఎంగేజ్ మెంట్

గతంలో చాలా తక్కువ సందర్భాల్లో కలిసే క్రికెట్.. రాజకీయాలు ఇటీవల కాలంలో ఈ రెండు రంగాల మధ్య బంధం బాగా బలపడుతోంది. క్రీడలు.. సినిమా రంగాలకు చెందిన వారు రాజకీయ నేతల్ని వివాహం చేసుకోవటం ఎక్కువ అవుతోంది. అందుకు నిదర్శనంగా మరో సెలబ్రిటీ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది.
ఇంతకూ ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరంటే.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యురాలు ప్రియా సరోజ్ కు.. టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి చేసుకోనున్నారు. వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ కు డేట్ ను డిసైడ్ చేశారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఈ జంట ఎంగేజ్ మెంట్ ఈ నెల ఎనిమిదిన జరగనుంది.
వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని.. పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంతకూ వీరిద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందన్న విషయానికి వస్తే.. ప్రియా సరోజ్ స్నేహితురాలి ద్వారా రింకూ సింగ్ కు ఆమె పరిచమయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ప్రియా సరోజ్.. మచిలీషహర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా కెరీర్ షురూ చేసిన ఆమె.. ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టటం.. పాతికేళ్ల వయసులోనే ఆమె ఎంపీగా ఎన్నిక కావటం తెలిసిందే. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్ ను 35,850 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ గెలుపుతో ఆమె ఒక రికార్డును సొంతం చేసుకున్నారు.
లోక్ సభలో అత్యంత చిన్న వయసులో ఎన్నికైన ఎంపీల్లో రెండో వ్యక్తిగా నిలిచారు. ప్రియా విద్యాభాస్యానికి వస్తే ఆమె ఢిల్లీలోని ఎయిర్ గోల్డెన్ జూబ్లీ ఇన్ స్టిట్యూట్ లో విద్యను అభ్యసించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి బీఏ.. అమిటీ వర్సిటీ నుంచి ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు.

ఇక.. టీమిండియాలో యువ క్రికెటర్ గా రాణిస్తున్న రింకూ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే రింకూ వయసు 27 ఏళ్లు. గతంలో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ ఉందని చెప్పినా.. అధికారికంగా వెల్లడికావటం ఇదే తొలిసారి. నవంబరు 18న వారణాసిలో వీరిద్దరి వివాహం జరగనుందని చెబుతున్నారు. రింకూది కూడా యూపీనే. తన విధ్వంసకర బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కీలక సభ్యుడిగా మారిన సంగతి తెలిసిందే. టీమిండియా సభ్యుడిగా ఇప్పటివరకు 2 వన్డేలు.. టీ20 మ్యాచ్ లు ముప్ఫై వరకు ఆడిన అతను.. ఇంగ్లండ్ తో జరిగే టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు. రింకూ కుటుంబ విషయానికి వస్తే ఆయన తండ్రి ఖాన్ చంద్రసింగ్ ఎల్ పీజీ బండలు డిస్ట్రిబ్యూట్ చేసే సంస్థలో సాధారణ ఉద్యోగిగా పని చేస్తున్నారు.

This post was last modified on June 3, 2025 5:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

29 minutes ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

3 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

3 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

4 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

4 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

5 hours ago