ఇది నార్వే టోర్నీలో చోటుచేసుకున్న అద్భుతమైన క్షణం. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఇది సాధించేశాడు. చెస్ ప్రపంచంలో దీన్ని ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించొచ్చు. ఈ విజయంతో గుకేశ్ ప్రత్యక్షంగా ప్రపంచ స్థాయిలో తనను తాను నిలబెట్టుకున్నాడు.
ఆరు రౌండ్లలో కీలకంగా నిలిచిన ఈ పోరులో గుకేశ్ ఆటలో ఓ వృద్ధి స్పష్టంగా కనిపించింది. కార్ల్‌సన్ చేసిన చిన్న పొరపాటును వెంటనే గుర్తించి తన ప్రయోజనంగా మలచుకున్నాడు. ఈ ఒత్తిడిలో మాగ్నస్ పిడికిలితో టేబుల్ కొట్టడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత గుకేశ్‌ను క్షమించమని రెండు సార్లు అడగడం కూడా కార్ల్‌సన్‌పై ఒత్తిడి ఎలా పెరిగిందో చెప్పకనే చెబుతోంది.
నెంబర్ వన్ ప్లేయర్ ను మూడో స్థానంలో ఉన్న గుకేశ్ ఓడించడంతో వరల్డ్ వైడ్ గా ఈ పోరు హైలెట్ అయ్యింది. ఇప్పటివరకు టోర్నీలో గుకేశ్ స్థిరంగా ఆడుతున్నా, ఈ మ్యాచ్ తర్వాత అతనిపై అంతర్జాతీయంగా దృష్టి మరలింది. గతేడాది ఇదే టోర్నీలో ప్రజ్ఞానంద కూడా కార్ల్‌సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అంటే భారత యువత చెస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ను ఎదుర్కొనే స్థాయికి చేరిపోయిందని ఇది సూచన.
ప్రస్తుతం కార్ల్‌సన్ టాప్‌లో ఉన్నప్పటికీ ఈ ఓటమి అతనికి మానసికంగా పెద్ద ఎదురుదెబ్బే. ఇక గుకేశ్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో ముందు వచ్చే మ్యాచ్‌లపై ఆసక్తి మరింత పెరిగింది. ఒకప్పుడు చెస్‌ను చూసేది కొద్దిమంది మాత్రమే అయితే, ఇప్పుడు గుకేశ్, ప్రజ్ఞానంద లాంటి యువ క్రీడాకారుల విజయాలతో ఈ ఆట సామాన్య ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోతోంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on June 2, 2025 2:24 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…