Trends

అలెర్ట్.. క్రోమ్ యూజర్లకు హెచ్చరిక!

ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు అనేకమంది ఆశ్రయించే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ప్రస్తుతానికి ప్రమాదకరమైన భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్పష్టంగా హెచ్చరించింది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లలో పాత వెర్షన్‌ క్రోమ్‌ను ఉపయోగిస్తున్నవారిపై సైబర్ ముప్పు పొంచి ఉందని వివరించింది.

ఎలా దాడి జరుగుతోంది?
CVE-2025-4664, CVE-2025-4609 అనే రెండు బగ్స్ వల్ల క్రోమ్ లోడింగ్, మోజో కాంపోనెంట్ పనితీరులో లోపాలు ఏర్పడుతున్నాయి. ఈ బగ్‌లను టార్గెట్ చేస్తూ హ్యాకర్లు ఓ మాలిషియస్ వెబ్‌సైట్‌ను యూజర్ ఓపెన్ చేస్తే, అతని కంప్యూటర్‌ను కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశముంది.

విండోస్ వినియోగదారులలో 136.0.7103.114 కంటే పాత వెర్షన్ ఉన్నవారు, అలాగే మ్యాక్, లైనక్స్ వాడేవారు 136.0.7103.113 కంటే పాత వెర్షన్లు వాడుతున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీరంతా వెంటనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది.

తక్షణమే చేయాల్సిన చర్యలు ఏమిటంటే.. బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, పైభాగంలో కుడివైపు మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అందులో ‘Help’ ఆ తరువాత ‘About Google Chrome’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే, క్రోమ్ తాజా వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయడం మర్చిపోకండి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో ఈ చిన్న అప్డేట్, పెద్ద నష్టాన్ని తప్పించగలదు. క్రోమ్ వాడుతున్న ప్రతి యూజర్‌కి ఇది అత్యవసర హెచ్చరిక. డేటా సురక్షితంగా ఉండాలంటే చర్య ఇప్పుడే అవసరం. 

This post was last modified on May 21, 2025 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

12 minutes ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

24 minutes ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

3 hours ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

12 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

13 hours ago