Movie News

హరీష్ శంకర్… ఇదే శ్రద్ధ కథ మీద కూడా పెట్టారా?

హరీష్ శంక్.. ఈ పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఛాతీలు విచ్చుకుంటాయి. ఎక్కడలేని ఉద్వేగం తన్నుకొస్తుంది. పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగ్గ విజయం లేక దాదాపు దశాబ్దం పాటు ఇబ్బంది పడుతున్న దశలో ‘గబ్బర్ సింగ్’తో అభిమానుల కరవు తీర్చేశాడు ఈ దర్శకుడు.

మామూలుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చాక ఆ దర్శకుడితో ఆ హీరో త్వరగా ఇంకో సినిమా చేసేస్తాడు. కానీ పవన్, హరీష్ కలయిక మళ్లీ కార్యరూపం దాల్చడానికి పుష్కరానికి పైగానే సమయం పట్టింది. ఎట్టకేలకు వీరి కలయికలో తెరకెక్కిన రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 26నే రిలీజ్. ఐతే ఈ సినిమాపై అభిమానుల్లో మరీ ఎక్కువ అంచనాలు లేవు.

అందుక్కారణం.. హరీష్ శంకర్ రీసెంట్ ఫామ్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత తనపై పెరిగిన అంచనాలను హరీష్ అందుకోలేకపోయాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ ఓ మాదిరిగా ఆడాయి కానీ.. భారీ విజయం దక్కించుకోలేకపోయాయి. మిగతా చిత్రాలన్నీ ఫెయిల్యూర్లే.  ముఖ్యంగా హరీష్ చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాగా ఆలస్యం కావడం.. ఇది రీమేక్ అన్న ప్రచారం జరగడం.. ఇంకా కొన్ని కారణాల వల్ల దీనిపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. కానీ హరీష్ మాత్రం పవన్ అభిమానులకు మళ్లీ ఒక మరపురాని సినిమాను అందిస్తానంటున్నాడు. ‘ఉస్తాద్..’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పవన్ గురించి, సినిమా గురించి ఆయన చెప్పిన కబుర్లు ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

వేరే సినిమాల్లో పెద్దగా డ్యాన్సులు వేయని పవన్.. ‘ఉస్తాద్’ కోసం అంత ఎఫర్ట్ పెట్టడం గురించి హరీష్ మాట్లాడాడు. డ్యాన్స్ మాస్టర్ వచ్చి.. 1 2 3 నంబర్స్ చెప్పి డ్యాన్స్ వేయమంటే పవన్ వేయడని.. ఆయన మూడ్‌ను మనం అర్థం చేసుకోవాలని, అలాగే ఈ పాట ఎందుకు వస్తుంది, అందులో డ్యాన్సులు ఎందుకు వేయాలి అన్నది చెబితే.. కష్టం అయినా డ్యాన్సులు వేస్తాడని హరీష్ చెప్పాడు. పవన్‌ను ఒప్పించడంలో తన దగ్గర ఇంకో ట్రేడ్ సీక్రెట్ కూడా ఉందని ఆయన అన్నాడు. 

ఇక ఈ సినిమాలో ఒక పాటలో పవన్ స్టెప్ వేస్తే సెట్లో ఉన్న వందల మంది క్లాప్స్ కొట్టి సూపర్ అన్నారని.. డ్యాన్స్ మాస్టర్ కూడా ఓకే చెప్పారని.. కానీ తాను మాత్రం వన్ మోర్ అన్నానని హరీష్ వెల్లడించాడు. ఇంతమంది క్లాప్స్ కొడుతున్నారు, మాస్టర్ కూడా ఓకే అన్నారు.. ఏంటి నీ సమస్య అంటూ పవన్ ఒకింత సీరియస్‌గా చూశాడని..

కానీ డ్యాన్స్ చేస్తున్నపుడు మీ హేర్ బౌన్స్ అయితే భలే ఉంటుందని, తనకు అది కావాలని చెబితే.. ‘‘డ్యాన్స్ చేయాలి. హేర్ బౌన్స్ అవ్వాలి. ఇన్ని కావాలా’’ అంటూ పవన్ ఇంకో టేక్ చేసినట్లు హరీష్ వెల్లడించాడు. ఐతే డ్యాన్స్ విషయంలో ఇంత సూక్ష్మమైన విషయంలో కూడా ఇంత శ్రద్ధ పెట్టిన హరీస్.. స్క్రిప్టు, టేకింగ్, పెర్ఫామెన్స్ విషయంలో కూడా ఇంతే ఫోకస్ పెట్టి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

This post was last modified on March 4, 2026 10:27 am

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

1 hour ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

2 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

2 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

2 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

2 hours ago