అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్న సంగతి తెలిసిందే. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న ముగ్గురు భారత సంతతి నేతలు గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. వీరిలో ఒకరి విజయం తాజాగా ఖరారైంది. దీంతో.. భారతీయ అమెరికన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారత సంతతికి చెందిన రాజా క్రిష్ణమూర్తి ముచ్చటగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. తాజా గెలుపుతో ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 71 శాతం ఓట్లతో ఆయన తన ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్ పై విజయం సాధించారు. ఢిల్లీలో జన్మించిన క్రిష్ణమూర్తి తాజా ఫలితాలతో మూడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఆయన తమిళనాడుకు చెందిన వారు.
కాలిఫోర్నియా నుంచి బరిలో దిగిన భారత సంతతికి చెందిన అమీ బిరా తన ప్రత్యర్థి కంటే దాదాపు 30 శాతం అధిక్యతలో కొనసాగుతున్నారు. ఐదోసారి చట్టసభకు వెళ్లే అవకాశం ఉందని చెబుతుననారు. మరో భారత సంతతికి చెందిన రో ఖన్నా కూడా ముచ్చటగా మూడోసారి గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయన తన ప్రత్యర్థిపై యాభై శాతం ఓట్ల మెజార్టీతో దూసుకెళుతున్నారు. ఇలా.. భారత సంతతికి చెందిన పలువురు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పయనిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీరంతా డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారు కావటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates