యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములు ఎవరి పక్షాన వెళ్లనున్నాయన్న విషయం గంట.. గంటకు మారుతున్న వేళకు కాస్త ముందుగా ట్రంప్ మాట్లాడారు. ఓటమి కంటే గెలుపు సులువని చెప్పిన ఆయన.. తన ప్రత్యర్థి డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమిని తట్టుకోవటం తనకు చాలా కష్టసాధ్యమని పేర్కొన్నారు.
అదే సమయంలో తాను గెలుపోటముల గురించి ఇప్పుడు ఆలోచించటం లేదన్న ఆయన..తనదైన ఫిలాసఫీని చెప్పుకొచ్చారు. పోలింగ్ జరుగుతున్న వేళలో.. వర్జీనియా రాష్ట్రంలోని ఆర్లింగ్టన్ పట్టణ ఎన్నికల కార్యాలయాన్ని ట్రంప్ సందర్శించారు. గెలుపు .. ఓటమి ఎప్పటికి సులువు కాకపోవచ్చన్న మాటలు ఆయన తీరును చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి.
తన వరకు వస్తే.. గెలుపే తేలికన్నట్లుగా ఆయన మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చేయాల్సిన ప్రసంగాల గురించి తాను ఇప్పుడు ఆలోచించటం లేదన్న ఆయన.. ఆ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడుతున్న ఫలితాలు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అటు ఇటుగా మారుతున్న ఫలితాలపై స్పష్టత రావటానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
This post was last modified on November 4, 2020 11:38 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…