ఆన్‌లైన్ పేమెంట్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడంలో UPI (యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఒక ట్రాన్సాక్షన్ పూర్తయ్యేందుకు సగటున 30 సెకన్లు పట్టేది. అయితే, జూన్ 16 నుంచి ఈ వ్యవధిని సగానికి తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై UPI డెబిట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లు కేవలం 15 సెకన్లలో పూర్తవుతాయని NPCI వెల్లడించింది.
ఈ నిర్ణయం అనుసంధాన బ్యాంకులకు API రెస్పాన్స్ టైమ్ పరిమితిని నిర్ణయించింది. ఒక పేమెంట్ ప్రారంభం నుంచి అది పూర్తయ్యే వరకు వ్యవధి 15 సెకన్లకు పరిమితం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది కేవలం వేగాన్ని పెంచే నిర్ణయం కాదు, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకమవుతుంది. ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసే సమయం కూడా 75 శాతం వేగంగా మారనుంది.
ఉదాహరణకు, మీరు ఒక షాపులో QR కోడ్ స్కాన్ చేసి DBS బ్యాంక్ యాప్ ద్వారా SBI ఖాతాలోకి పేమెంట్ చేస్తే, మొత్తం ప్రక్రియ (రిక్వెస్ట్ పంపడం, NPCI ద్వారా వెళ్తుంది, DBS నుండి కన్ఫర్మేషన్ రావడం, మళ్లీ SBIకి తిరిగి వచ్చేవరకు) ఇప్పటివరకు 30 సెకన్లు పడుతుంది. కొత్త మార్గదర్శకాలతో ఇది కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతుంది.
పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్‌లు లేదా యాప్‌లు ఒకసారి ట్రాన్సాక్షన్ ప్రారంభించాక దాని స్టేటస్‌ను 90 సెకన్ల వరకు చెక్ చేయవచ్చని NPCI తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేగాక, కొన్ని బ్యాంకుల అనుసంధాన వ్యవస్థలు వేగంగా స్పందించకపోవడం వల్ల తలెత్తే ఫెయిల్యూర్లను కూడా తగ్గించేందుకు ఈ మార్పులు అమలవుతాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో UPI వృద్ధి రేటు సంవత్సరానికి 34% పెరిగింది. మొత్తం 17.89 బిలియన్ ట్రాన్సాక్షన్లు నమోదవగా, వీటి విలువ రూ.23.95 లక్షల కోట్లు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22% వృద్ధి. అయితే మార్చిలో 31 రోజులు ఉండగా, ఏప్రిల్‌లో 30 రోజులు మాత్రమే ఉండటంతో స్వల్ప తగ్గుదల కనిపించింది.
This post was last modified on May 2, 2025 5:55 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…