ఐపీఎల్ 2025లో సరికొత్త సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం నుంచి భారీ గిఫ్ట్ లభించింది. గుజరాత్ టైటాన్స్‌పై 14 ఏళ్ల వయసులోనే అదరగొట్టిన శతక ప్రదర్శనపై రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అతని అద్భుత ప్రతిభను గుర్తించి రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (గేల్ 30 బంతుల్లో సెంచరీ తర్వాత) సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు.
వైభవ్ ఈ విజయం సాధించిన వెంటనే సీఎం నితీశ్ “బీహార్ బిడ్డగా నిన్ను చూస్తూ గర్వపడుతున్నాం. నీ కృషి, నైపుణ్యం భవిష్యత్తులో భారత జట్టుకు పెద్ద ఆశగా నిలుస్తాయి. నీ విజయాలకు ఇది మొదటిపడుగు మాత్రమే” అంటూ పేర్కొన్నారు. వైభవ్ తండ్రితో గతంలో సమావేశమైన అనుభవాన్ని కూడా నితీశ్ గుర్తుచేశారు.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వైభవ్ ప్రదర్శనపై స్పందించారు. చిన్న వయసులోనే అంతటి స్థాయిలో రాణించడం గొప్ప విషయం అని కొనియాడారు. అంతే కాదు, బీహార్ నుంచి మరో జాతీయ స్థాయి ఆటగాడు ఎదిగినట్లు అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వైభవ్ అద్భుత ప్రదర్శన క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అతని కెరీర్ మరింత ఎత్తులకు చేరాలని బీహార్ రాష్ట్రం మొత్తం ఆకాంక్షిస్తోంది. 14 ఏళ్ల వయసులోనే ఈ స్థాయికి చేరుకున్న ఈ యువ క్రికెట్ రానున్న రోజుల్లో టీమిండియాలో చేరడం కాయమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates