IPL 2025: సెంచరీతో చుక్కలు చూపించిన 14 ఏళ్ళ వైభవ్

సూర్యవంశీ వైభవ్.. వయసు 14 సంవత్సరాల 32 రోజులు (2011 మార్చి 7).. బీహార్ కు చెందిన ప్లేయర్. అండర్ 14 ఆడాల్సిన సమయంలో అండర్ 19కి వెళ్లి హాట్ టాపిక్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని 1.1కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు IPL లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన 3వ మ్యాచ్ కే సెంచరీ పూర్తి చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు. అది కూడా కేవలం 35 బంతుల్లోనే. 

గేల్ తరువాతే మనోడే..

ఐపీఎల్ చరిత్రలోనే సెంచరీ బాధిన యంగెస్ట్ ప్లేయర్. ఇంతకుముందు రియాన్ పరాగ్ 17 ఏళ్ళ వయసులో 2019లో సెంచరీ చేశాడు. ఇక ఆ తరువాత అతిచిన్న వయసు ఇతనిదే. ఇక అత్యధికంగా వేగంగా IPL లో సెంచరీ చేసిన 2వ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. గేల్ 2013లో (RCB VS పూణే) 30 బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. 

ఇషాంత్ బౌలింగ్ లో ఊచకోత

ఫాస్ట్ బౌలర్ లేదు.. స్పిన్ బౌలర్ లేదు.. ప్రసిద్ కృష్ణ 140 స్పీడ్ లో వేసినా, ఇషాంత్ శర్మ బౌన్సర్లు వేసినా అసలు చెట్లు నాటాలని అనుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టేడియంలో సిక్స్ ల మోతతో గుజరాత్ బౌలర్లను గడగడా లాడించాడు. ఇషాంత్ శర్మ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగు పెట్టి టాప్ బౌలర్ గా ఉన్న సమయంలో కూడా వైభవ్ ఇంకా పుట్టనే లేదు. అలాంటిది అతని బౌలింగ్ లో 28 రన్లు కొట్టాడు. 

ఓకే ఓవర్ లో 30 పరుగులు

ఇక సిరాజ్ బౌలింగ్ ను కూడా ఉతికి పారేశాడు. పవర్ ప్లే లోనే వాషింగ్టన్ సుందర్ వేసిన 5 ఓవర్ లో రెండు సిక్స్ లు రెండు ఫోర్లు కొట్టేసి 17 బాల్స్ లోనే అర్దశతకం పూర్తి చేశాడు.  ఇక కరీం జనథ్ వేసిన 10వ ఓవర్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లు కొట్టి 30 రన్లు రాబట్టాడు. ఆ తరువాత వైభవ్ మరింత కాన్ఫిడెన్స్ తో బౌండరీలు బాదేశాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే.. సెంచరికీ దగ్గరైన కూడా అతను బెదరలేదు.. తడబడలేదు. నెంబర్ వన్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. దీన్ని బట్టి అతని ధైర్యం ఏ లెవెల్లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.   

మొత్తంగా 38 బంతుల్లో 101 పరుగులు చేసి చివరగా ప్రసిద్ కృష్ణ వేసిన యార్కర్ బాల్ కు బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. వైభవ్ మొత్తం 11 సిక్స్ లు 7 ఫోర్లు కొట్టాడు. ఇక రాజస్థాన్ ఈ మ్యాచ్ లో 210 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ బ్యాటర్స్ ఈ మ్యాచ్ లో పర్ఫెక్ట్ గానే టార్గెట్ చేశారు. గిల్ (84) – బట్లర్ (50) తో 209 పరుగులు లక్ష్యాన్ని  సెట్ చేశారు. ఇక రాజస్థాన్ ఓపెనింగ్ పాట్నర్స్ జైస్వాల్ జైస్వాల్ 70(40 బంతుల్లో 9 ఫోర్లు – 2 సిక్స్ లు) – వైభవ్ సూర్యవంశీ 101 (38) అద్భుతమైన ఆటతో టార్గెట్ ను చాలా ఈజీ చేసేశారు. చివరగా రియన్ పరాగ్ సిక్స్ తో ఆటను ముగించి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు.