బేబీ షార్క్ డుడుడుడుడు.. అంటూ అనుకోకుండా యూట్యూబ్‌లో వీడియో ప్లే అవుతుండగానో, లేదా ఈ తరం పిల్లలు హమ్ చేస్తుండగా పెద్దోళ్లు చాలాసార్లు వినే ఉంటారు. అదేంటో తెలియకుండానే అనుకోకుండా చూడటమో, వినడమో యూట్యూబ్‌తో టచ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇప్పుడు ఆ వీడియోనే ప్రపంచంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న యూట్యూబ్ వీడియోగా రికార్డులకు ఎక్కింది.
ఏకంగా ఈ వీడియోకు 700 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే దాని రీచ్ ఎలాంటిది అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా కరెక్టుగా ఆ నంబర్ చెప్పాలంటే.. సోమవారం అర్ధరాత్రి సమయానికి 7,044,257,825 వ్యూస్ తెచ్చుకుంది. అంటే ప్రపంచ జనాభా ఎంత ఉందో దాదాపుగా అన్ని వ్యూస్ వచ్చాయన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ చూసినట్లు కాదు కానీ.. జనాభాకు సమానంగా వ్యూస్ రావడం మాత్రం అనూహ్యం.
పిల్లల వీడియోలకు ఫేమస్ అయిన దక్షిణ కొరియా సంస్థ ఫింక్ పాంగ్ రూపొందించిన వీడియో ఇది. దాన్ని చూస్తే ఇందులో విశేషం ఏముంది అనిపిస్తుంది. చాలా సింపుల్‌గా అనిపించే యానిమేషన్ వర్క్. నీటిలో నిలబడి ఉన్నట్లుగా ఉన్న ఇద్దరు పిల్లలు బేబీ షార్క్ డుడుడు.. మమ్మీ షార్క్ డుడుడు.. డాడీ షార్క్ డుడుడు.. అంటూ పాడుతుంటారు. ఆ వీడియో నిడివి 2 నిమిషాల 16 సెకన్లే.
అయితేనేం 2016లో రిలీజైన ఈ వీడియో వందల కోట్ల వ్యూస్‌తో సంచలన రికార్డును అందుకుంది. ఇప్పటిదాకా లూయిస్ ఫాన్సి ‘డెస్పాసిటో’ పేరుతో రూపొందించిన లాటిన్ పాప్ స్మాష్ పేరిట అత్యధిక వ్యూస్ రికార్డును ఇది బద్దలు కొట్టేసింది. దాని వ్యూస్ ప్రస్తుతం 703.8 కోట్లుగా ఉన్నాయి. బేబీ షార్క్ వీడియోను ఇప్పటిదాకా ప్లే చేసిన సమయం మొత్తాన్ని లెక్కగడితే 30,187 సంవత్సరాలుగా తేలడం విశేషం.
This post was last modified on November 3, 2020 3:03 pm
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…
రాయ్పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. "కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది" అని విమర్శించే…
ఒకే కుటుంబం నుంచి రెండు తరాలకు చెందిన స్టార్ హీరోలతో జోడిగా నటించే ఛాన్స్ అందరికీ రాదు. అప్పుడెప్పుడో శ్రీదేవి…