అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. కరోనా వైరస్ తర్వాత ఈ స్ధాయిలో ప్రపంచ దేశాల్లోని జనాభాలు మాట్లాడుకుంటున్నది అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించే అంటే అతిశయోక్తి కాదేమో. అసలు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలంటే యావత్ ప్రపంచం ఎందుకింతగా ఉత్కంఠగా చెప్పుకుంటోంది ? మిగిలిన దేశాల్లోని ఎన్నికలు వచ్చినపుడు ఎవరు ఇంతగా మాట్లాడుకోరన్న విషయం వాస్తవం. మరి ఇతర దేశాల్లో లేని ప్రత్యేకత ఒక్క అమెరికాకు మాత్రమే ఎందుకు ? ఎందుకంటే అమెరికా మాత్రమే పెద్దన్న పాత్రలో ప్రపంచాన్ని శాసిస్తోంది కాబట్టి. అమెరికాలో అమలయ్యే పాలసీలే యావత్ ప్రపంచంలోని జనాల అదృష్టాలను మార్చేస్తుంది కాబట్టే.
ప్రపంచదేశాల్లో అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, అమెరికాలోనే స్ధిరపడాలని అనుకునే జనాలందరు అగ్రరాజ్య ప్రభుత్వ పాలసీలను రెగ్యులర్ గా ఫాలో అవుతారు. ఈ పాలసీలు తయారయ్యేది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల హామీలు, ఆలోచనా సరళిపైనే ఆధారపడుంటుంది. అందుకనే ప్రపంచ దేశాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అందరిలోను అంత టెన్షన్ పెరిగిపోతుంటుంది.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ట్రంపే రెండోసారి అధికారంలోకి వస్తాడని కొందరు అంచనా వేస్తున్నారు. కాదు జో బైడెన్ దే గెలుపని మరికొందరు జోస్యాలు చెబుతున్నారు. వీళ్ళ అంచనాలకు తోడు అమెరికాలోని వివిధ యూనివర్సిటిలు, సర్వే సంస్ధలు, మీడియాలు నిర్వహించిన సర్వేలు ఆధారంగా ఎవరి అంచనాలకు వాళ్ళు వస్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేసే వివిధ వర్గాలే చాలా కీలకం. వీరిలో అమెరికాలోని శ్వేతజాతీయులు, హిస్పానియన్లు, నల్ల జాతీయులు, నిరుద్యోగులు, ఏషియా అమెరికన్లు, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు, కాలేజీ డిగ్రీ లేని ఓటర్లున్నారు.
శ్వేతజాతీయుల ఓట్లు 69 శాతం ఉన్నాయి. హిస్పానిక్, నల్లజాతీయుల ఓట్లు చెరో 11 శాతం ఉన్నాయి. ఏషియా అమెరికన్ల ఓట్లు 6 శాతం ఉంది. 50 ఏళ్ళ వయసు పైబడిన వారు 52 శాతం, కాలేజీ డిగ్రీలేని ఓటర్లు 65 శాతం ఉన్నారు. క్రైస్తవ ఓటర్లు 60 శాతం ఉన్నారు. పై తరగతులన్నింటిలోకి చూస్తే 69 శాతం ఉన్న శ్వేతజాతీయుల ఓట్లే చాలా కీలకం. వీరిలో మెజారిటి ఓటర్లు ట్రంప్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు అనేక సర్వేలో బయటపడింది.
అమెరికాలో అమెరికన్లది మాత్రమే ఆధిపత్యం ఉండాలని కోరుకునే వాళ్ళంతా ట్రంపుకే ఓట్లేస్తారనేది ఓం అంచనా. ప్రస్తుతం అమెరికాలో ఏ రంగంలో చూసినా ఇతర దేశీయుల ఆధిపత్యం నడుస్తోంది. అమెరికా అంటేనే నానా జాతి సమితి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి వల్లే అమెరికా ఇంతగా డెవలప్ అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇతర దేశాల ఆధిపత్యం పెరిగిపోవటాన్ని అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగిన వాళ్ళు సహించలేకపోతున్నారట. కాబట్టి అలాంటి వాళ్ళందరు ట్రంప్ కే మద్దతుగా నిలుస్తున్నారు. వీళ్ళ ఓట్లు గనుక సాలిడ్ గా పడితే ట్రంప్ రెండోసారి గెలవటం ఖాయమని సమాచారం. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on November 3, 2020 10:27 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…