భార్యలను భర్తలు వేధించి రోజులు చూశాం. తాగొచ్చి.. తిట్టి.. కొట్టి.. పుట్టింటికి పంపేసిన రోజులు కూడా చూశాం. అందుకే.. కేంద్రం గృహ హింస నిరోధక చట్టం తెచ్చింది. అయితే..కాలం తిరగబడింది. ఉద్యోగాలు చేసే మహిళలతోపాటు.. భర్తలపై తిరగబడే భార్యల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ నుంచి ఏపీ వరకు కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు గోదావరిలో భర్త ఇంటిని శుభ్రం చేయాలేదని(ఊడవలేదని) గొడవ పడిన భార్య.. ఆయన పడుకున్న సమయంలో వాతలు పెట్టింది.
భర్త ఆస్తిని తనకు రాయలేదని ఢిల్లీలో ఏకంగా..భర్తపై మరిగే నూని పోసి.. ఆనందించిందో భార్య. ఇక, తమ మాట వినని భర్తలపై గృహ హింస నిరోధక చట్టం కింద కేసులు పెడుతున్న భార్యామణులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలని.. తమ కోసం కూడా చట్టాలు చేయాలని కోరుతూ.. భార్యా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పుట్టిందే ‘భార్యాబాధిత సంఘం’. అయితే..ఒకప్పుడు దీనిని చూసి నవ్వుకునేవారు.
కానీ.. ఇప్పుడు భార్యా బాధిత సంఘంలో 3 లక్షల మంది సభ్యులు తయారయ్యారు. వీరంతా దక్షిణాదికి చెందిన వారు. ఉత్తరాదిలో మరో రెండు సంఘాలు ఉన్నాయి. అయితే.. తాజాగా వీరంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాతో పాటు నిరసన కూడా వ్యక్తం చేశారు. తమకు కూడా హక్కులు ఉన్నాయని.. తమపై దాడులు చేస్తున్న హత్యలకు కూడా తెగబడుతున్న భార్యలను శిక్షించేలా.. ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
చిత్రం ఏంటంటే.. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భార్యా బాధిత సంఘం ఆందోళనలో కొందరు పోలీసులు కూడా పాల్గొన్నారు(అంటే.. వారు కూడా బాధితులే). ఇంకొందరు మాజీ అధికారులు, ఒకరిద్దరు పేరు చెప్పడానికి ఇష్టపడని మాజీ ఐఏఎస్‌లు కూడా ఉన్నారు.(కర్ణాటకలో మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు తన భార్య కొడుతోందని గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తావనార్హం). ఇక, ఇదే నిరసనలో కొందరు మహిళలు కూడా పాల్గొని పురుషులకు మద్దతు ప్రకటించారు.
చిత్రంగా ఉన్నా ఇది నిజం. అయితే.. వీరు.. భార్యల చేతిలో చావుదెబ్బ తిన్న భర్తల తాలూకు కుటుంబ సభ్యులట. ఏదేమైనా.. ఈ వ్యవహారం తీవ్రంగానే సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చే ఐదు పదేళ్లలో గృహ హింస చట్టం మాదిరిగానే.. పురుష రక్షణ కోసం ఏదైనా చట్టం వచ్చే అవకాశం లేకపోలేదు.
This post was last modified on April 21, 2025 10:42 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…