ఆయన మాజీ డీజీపీ. కర్ణాటక రాష్ట్రంలో సుదీర్ఘ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహించి.. అనేక సంస్కర ణలకు కీలక పాత్ర పోషించారు. అలాంటి డీజీపీ రిటైరైన తర్వాత.. ఇంట్లో విశ్రాంతి జీవితం గడుపుతున్నా రు. అయితే.. భార్యతో ఏర్పడిన వివాదాలు ఏకంగా హత్యకు దారి తీశాయి. తననే చంపబోయాంటూ.. సదరు భార్య మాజీ డీజీపీని దారుణంగా హత్య చేసింది. కొన ఊపిరితో రక్తపు మడుగులో చిక్కుకున్న భర్తను వీడియో తీసింది.
అంతేకాదు…. తన ఫ్రెండ్ ప్రస్తుత డీజీపీ భార్యకు ఫోన్ చేసి.. రాక్షసుడిని చంపేశానంటూ.. పైశాచిక ఆనం దం వ్యక్తం చేసింది. ఈ ఘటన కేవలం కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా పెను సంచలనంగామారింది. కర్ణాటక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన ఓం ప్రకాశ్ .. కొన్నాళ్ల కిందటే రిటైరయ్యారు. ఇంట్లోనే ఉంటూ.. సొంత వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పల్లవి తరచుగా ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడడం.. నవ్వడం.. చూసిన ఆయనకు అనుమానం కలిగింది.
అదేసమయంలో ఆస్తుల వివాదం ఉండనే ఉంది. ఈ రెండు కారణాలతో భార్యను అనుమానించిన ఓం ప్రకాశ్.. తరచుగా ఆమె గొడవలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే తరహాలో ఎవరితోనో ఫోన్లో రహస్యంగా మాట్లాడుతుండడాన్నిగమనించిన ఓం ప్రకాశ్ పల్లవిని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య మాటా మా టా పెరిగింది. ఈ క్రమంలో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను భార్య పల్లవి కూరలు తరగే కత్తితో పదే పదే పొడిచి హత్య చేసింది.
హత్య అనంతరం ప్రస్తుతం డీజీపీ భార్యకు వీడియోకాల్ చేసి రాక్షసుడిని చంపేశానని రక్తపుమడుగులో ఉన్న భర్త డెడ్ బాడీ చూపించింది. తనను భర్త హత్య చేయడానికి ప్రయత్నించాడని అందుకే చంపేశానని చెప్పింది. తొలుత అనుమానాస్పద హత్య గా భావించిన పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే పల్లవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
This post was last modified on April 21, 2025 10:15 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…