ఆలస్యమైతే అయ్యింది కానీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఈసారి మామూలుగా జరగట్లేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉత్కంభరితంగా సాగుతోంది ప్లేఆఫ్ రేసు. లీగ్ దశలో ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లు మాత్రమే. మామూలుగా ఈపాటికి నాలుగు ప్లేఆఫ్ బెర్తులూ ఖరారైపోయి ఉండాలి. కానీ ఇప్పటిదాకా ముంబయి తప్ప ఎవరూ ముందంజ వేయలేదు. చివరి రెండు మ్యాచ్‌లను బట్టే మూడు ప్లేఆఫ్ బెర్తులు ఖరారవుతాయి.
చెన్నై సూపర్ కింగ్స్ చాలా ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం ఓటముల చవిచూసిన కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంటి ముఖం పట్టాయి. మిగతా నాలుగు జట్లు ప్లేఆఫ్ మీద ఆశలతో ఉన్నాయి. సోమవారం రాత్రి ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లదే రెండో ప్లేఆఫ్ బెర్తు. ఓడిన జట్టుకు కూడా ప్లేఆఫ్ ఛాన్సుంటుంది కానీ.. అక్కడ నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.
ఢిల్లీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోతే.. బెంగళూరు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. కాబట్టి ఈ రెండు జట్లలో ఏది గెలుస్తుందో చెప్పలేం. దక్షిణాది అభిమానులకు ఫేవరెట్ జట్టు బెంగళూరే అన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోహ్లీ జట్టుకు భారీగా అభిమానులున్నారు. సోమవారం ఆ జట్టే గెలవాలని వారి ఆకాంక్ష. ఐతే బలాబలాల్లో చూస్తే కొంచెం బెంగళూరే తక్కువ అని చెప్పాలి. మరి ఈ రోజు బెంగళూరు ఓడిపోతే పరిస్థితి ఏంటన్న ఆందోళన అభిమానుల్ని వెంటాడుతోంది. ఐతే ఆ జట్టు ఓడినా.. మరీ ఎక్కువ తేడా లేకుండా చూసుకోవాలి.
కోల్‌కతాతో పోలిస్తే ఇటు బెంగళూరు, అటు ఢిల్లీల నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్లలో ఏది ఓడినా తేడా 20 పరుగులకు మించకూడదు. ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లయితే.. మ్యాచ్‌ను చివరి రెండు ఓవర్ల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అప్పుడు రన్‌రేట్ పడిపోదు. అప్పుడు కోల్‌కతాను వెనక్కి నెట్టి ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఐతే మంగళవారం ముంబయి చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోతే.. సోమవారం ఓడే జట్టుతో పాటు కోల్‌కతా కూడా రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్లిపోతాయి. సన్‌రైజర్స్ గెలిస్తే ఆ జట్టుతో పాటు మిగతా రెండు జట్లలో రన్‌రేట్ ఎక్కువన్న జట్టుకే ప్లేఆఫ్ ఛాన్సుంటుంది.
This post was last modified on November 2, 2020 3:49 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…