Trends

క్రికెటర్లు నగ్నంగా ఉన్న ఫొటోలు పంపారు

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్, లింగ మార్పు శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు అనయగా కొత్త జీవితం కొనసాగిస్తున్నారు. యూకేలో నివాసం ఉంటున్న అనయ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అనేక కీలక విషయాలను పంచుకున్నారు. చిన్ననాటి నుంచే తనలో అమ్మాయిగా ఉండాలన్న భావన బలంగా ఉండేదని, 8-9 ఏళ్ల వయస్సులోనే ఆ మార్పును గ్రహించానని ఆమె తెలిపారు.

క్రికెటర్‌గా ఉన్నప్పుడు అనయ.. సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి పలువురు ప్రముఖ యువ క్రికెటర్లతో కలిసి ఆడిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తన వ్యక్తిగత పరిస్థితిని తండ్రి సంజయ్ బంగర్‌కు ఉన్న గుర్తింపు కారణంగా ఎవరితోనూ పంచుకోలేకపోయానని పేర్కొన్నారు. అందుకే మొదట క్రికెట్ వర్గాల్లో తన భావాలను గోప్యంగా ఉంచుకున్నానని చెప్పారు.

అయితే లింగ మార్పు అనంతరం తన జీవితంలో ఎదురైన పరిస్థితులపై కూడా అనయ ఓపెన్‌గా మాట్లాడారు. తన నిర్ణయాన్ని కొందరు ఆదరించగా, మరికొందరి నుంచి వేధింపులు ఎదురైనట్లు చెప్పారు. కొంతమంది క్రికెటర్లు తనకు నగ్న చిత్రాలు పంపారని, మరికొందరు అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. ఒకసారి ఓ మాజీ క్రికెటర్ తన పరిస్థితిని తెలియజేయగా, అతను తనతో కలిసి కారులో వెళ్లి గడపాలని చెప్పాడని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో అనయ వెల్లడించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ధైర్యంగా చెప్పిన నిజాలను ఎంతో మంది అభినందిస్తున్నారు. సమాజం మరింత సహానుభూతితో చూసే దిశగా ఆమె జీవిత ప్రయాణం మార్గదర్శకంగా నిలుస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాలను క్లియర్ గా చెప్పినప్పటికీ, ఇబ్బంది పెట్టిన వారి గురించి మాత్రం బయటకు చెప్పలేదు.

This post was last modified on April 18, 2025 3:13 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Aryan Bangar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago