ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఉత్కంఠ, థ్రిల్. మరి మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్ దాకా వెళ్లితే ఆ మజా రెండింతలవుతుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడం కేవలం పాయింట్ల విషయంలో కాదు… ఓ ప్రత్యేక రికార్డు విషయంలోనూ నిలిచిపోయింది.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు వెళ్లగా, అందులో అత్యధికంగా నాలుగు సార్లు గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది టీమ్‌కి సాధారణ గౌరవం కాదు. ఒత్తిడిలోనూ సత్తా చాటే పవర్ ఉన్నదని ఇదే సూచిస్తోంది. ఢిల్లీ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మూడు సార్లు విజయం సాధించి రెండో స్థానంలో ఉంది.
ఇక ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలా మిగతా జట్లు రెండు సార్ల చొప్పున విజయాలు నమోదు చేశాయి. అయితే, ఈ గణాంకాల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కొన్ని జట్లు కీలక మ్యాచ్‌ల్లో తప్పిపోయినా, కొన్ని జట్లు ఎప్పటికప్పుడు సూపర్ ఓవర్ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
ఇక ఒక్కొక్క సూపర్ ఓవర్ మ్యాచ్ వివరాలు చూస్తే:
1. 2009, ఏప్రిల్ 23 – రాజస్థాన్ vs కోల్‌కతా, కేప్ టౌన్
విజేత: రాజస్థాన్ రాయల్స్
2. 2010, మార్చి 21 – పంజాబ్ vs చెన్నై, చెన్నై
విజేత: పంజాబ్
3. 2013, ఏప్రిల్ 7 – హైదరాబాద్ vs బెంగళూరు, హైదరాబాద్
విజేత: హైదరాబాద్
4. 2013, ఏప్రిల్ 16 – బెంగళూరు vs ఢిల్లీ, బెంగళూరు
విజేత: బెంగళూరు
5. 2014, ఏప్రిల్ 29 – రాజస్థాన్ vs కోల్‌కతా, అబుదాబి
విజేత: రాజస్థాన్
6. 2015, ఏప్రిల్ 21 – పంజాబ్ vs రాజస్థాన్, అహ్మదాబాద్
విజేత: పంజాబ్
7. 2017, ఏప్రిల్ 29 – ముంబై vs గుజరాత్, రాజ్‌కోట్
విజేత: ముంబై
8. 2019, ఏప్రిల్ 30 – ఢిల్లీ vs కోల్‌కతా, ఢిల్లీ
విజేత: ఢిల్లీ
9. 2019, మే 2 – ముంబై vs హైదరాబాద్, ముంబై
విజేత: ముంబై
10. 2020, సెప్టెంబర్ 20 – పంజాబ్ vs ఢిల్లీ, దుబాయ్
విజేత: ఢిల్లీ
11. 2020, సెప్టెంబర్ 28 – బెంగళూరు vs ముంబై, దుబాయ్
విజేత: బెంగళూరు
12. 2020, అక్టోబర్ 18 – కోల్‌కతా vs హైదరాబాద్, అబుదాబి
విజేత: కోల్‌కతా
13. 2020, అక్టోబర్ 18 – పంజాబ్ vs ముంబై, దుబాయ్
విజేత: పంజాబ్
14. 2021, ఏప్రిల్ 25 – హైదరాబాద్ vs ఢిల్లీ, చెన్నై
విజేత: ఢిల్లీ
15. 2025, ఏప్రిల్ 16 – ఢిల్లీ vs రాజస్థాన్, ఢిల్లీ
విజేత: ఢిల్లీ
This post was last modified on April 17, 2025 3:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…