ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది పిల్లలు, 30 శాతం మంది పెద్దలు ఈ ఇంజెక్షన్ భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒక వినూత్న పరిష్కారం వచ్చేసింది.. అదే సూది లేని ఇంజెక్షన్. బెంగళూరులో తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
ఈ పరికరాన్ని ‘ఎన్-ఫిస్’ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇది సూదిలేకుండా మందును శరీరంలోకి చొప్పించగలదు. ఎలాగంటే, మందును అధిక పీడనంతో చర్మం పైపైన ఉండే సూక్ష్మ రంధ్రాల గుండా లోపలికి పంపుతుంది. ఫలితంగా నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం చొచ్చుకుపోతుంది. టీకాలు, ఇమ్యూనైజేషన్, డయాబెటిస్, పెయిన్ మేనేజ్‌మెంట్ తదితర చికిత్సల కోసం దీనిని వినియోగించవచ్చు.
ప్రస్తుతం దేశంలో వెయ్యికి పైగా వైద్యులు ఈ సూనీదు ఇంజెక్షన్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన వినియోగంతో పాటు, భద్రతా ప్రమాణాలను కూడా ఈ పరికరం పాటిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలను అనుసరిస్తోంది. ముఖ్యంగా బాలల కోసం టీకాలు ఇవ్వడంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది.
ఇంటెగ్రి మెడికల్ సంస్థ ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తో ఈ పరికరం వినియోగంపై ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ టెక్నాలజీని విస్తరించే లక్ష్యంతో వారు ముందడుగు వేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఈ పరికరం ఒక మార్గదర్శకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంజెక్షన్ భయాన్ని అడ్డంకిగా మార్చుకుని వైద్యాన్ని దూరంగా ఉంచుకునే వారికి, ఇప్పుడు ఇది నిజమైన వరం అని చెప్పొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల మానసిక భయాలను కూడా తొలగించగలదని ‘ఎన్-ఫిస్’ ఉదాహరణగా నిలుస్తోంది.
This post was last modified on April 16, 2025 10:38 am
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…