Trends

బ‌ట్ట‌త‌ల‌ పై జుట్టు: ఎంతమంది బకరాలో చూడండి

తిమిరి ఇసుక‌న తైలంబు తీయ‌వ‌చ్చు.. అని భ‌తృహ‌రి శుభాషితం చెబుతున్నా.. బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌లు మొలిపించ‌డం మాత్రం ఎవ‌రికీ సాధ్యం కాదనేది అంద‌రికీ తెలిసిందే. లేక‌పోతే.. ప్ర‌పంచ కుబేరులు సైతం.. బ‌ట్ట‌త‌ల‌తోనే ఎందుకు బ‌తుకుతారు? అనేది ప్ర‌శ్న‌. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వారుకూడా.. విగ్గుల‌ను ఎందుకు ఆశ్ర‌యిస్తార‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. సో.. బ‌ట్ట‌త‌ల‌ పై వెంట్రుక‌లు మొలిపించ‌డం అన్న‌ది సాధ్యం కాదు. ఈ విష‌యం తెలిసి కూడా.. కొంద‌రు మోస‌పోతూనే ఉన్నారు.

మోస‌కారులు ఉన్నంత వ‌ర‌కు.. మోసం చేసేవారు ఉన్నార‌న్న‌ట్టుగా.. తాజాగా బ‌ట్ట‌త‌ల‌పై వెంట్రుక‌ల‌ను చిటెక‌లో మొలిపిస్తానంటూ.. వ‌చ్చిన కొందరు వ్య‌క్తులు మ‌న హైద‌రాబాదీల‌కు ప‌క్క‌గా గుండుకొట్టారు. ఉన్న వెంట్రుక‌లు కూడా తీసేసి.. తైలం రాశారు. ఇంకేముంది.. 24 గంటల్లో తుమ్మ మొక్క‌లు మొలిచిన‌ట్టు మీ నెత్తిపై వెంట్రుక‌లు వ‌చ్చేస్తాయ‌ని చెప్పారు. ఇది నిజ‌మేన‌ని న‌మ్మిన హైద‌రాబాదీలు క్యూ క‌ట్టి మ‌రీ.. స‌ద‌రు వ్య‌క్తుల‌ను న‌మ్మారు. చివ‌రకు ప‌క్కాగా మోస పోయారు.

ఏం జ‌రిగింది?

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోష‌ల్ మీడియాలో ప్రకటన చేశాడు. దీనిని న‌మ్మిన కొంద‌రు వ్య‌క్తులు నిజంగానే త‌మ బ‌ట్ట‌త‌ల‌కు బ్ర‌హ్మాండ‌మైన రోజులు వ‌స్తున్నాయ‌ని భావించారు. ఇంకేముంది.. వ‌కీల్ చెప్పిన చోటుకు క్యూ క‌ట్టారు. ఇలా వచ్చిన వారి నుంచి వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టేశాడు. అంటే.. ఉన్న కొద్దిపాటి వెంట్రుక‌లు తీసేశాడు. అనంత‌రం.. గుండుపై కెమికల్స్ రాసి పంపించాడు.

ఈ సంద‌ర్భంగా గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు పెట్టాడు. ఇలా 24 గంట‌లు ఉంటే.. బ్ర‌హ్మాండంగా వ‌త్తుగా వెంట్రుక‌లు పెరుగుతాయ‌ని వాగ్దానం కూడా చేశాడు. తీరా చూస్తే.. ఇలా కెమిక‌ల్ రాయ‌డంతో చాలా మందికి అది రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతలపై వెంట్రుక‌ల మాట ఎలా ఉన్నా.. వందలాది మంది యువకులు ఉన్న జుట్టు కూడా పోయి.. ల‌బోదిబోమంటున్నారు. ఏదేమైనా.. బ‌ట్ట త‌ల కూడా అదృష్ట‌మే అనుకుంటే.. ఏ గొడ‌వా ఉండ‌దు క‌దా.. అంటున్నారు… జుట్టున్న యువ‌కులు.

This post was last modified on April 7, 2025 6:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago