ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757 మంది ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను ప్రస్తుతం ఇస్తున్న రూ.4,500 నుంచి నేరుగా రూ.12,500కు పెంచుతున్నట్లు వేదికపైనే ప్రకటించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చిన ఈ ప్రకటనతో ట్రైనీ కానిస్టేబుళ్లు కేరింతలు కొట్టారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాల ద్వారా ఆ మాటను కార్యరూపంలోకి తెచ్చామని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సమర్థతకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న పోలీసు యువకులు నిబద్ధతతో ప్రజల భద్రత కోసం పనిచేయాలని పిలుపునిస్తూ, నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లందరికీ సీఎం అభినందనలు తెలియజేశారు.
This post was last modified on December 16, 2025 11:08 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…