ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని మొదలుపెట్టిన సినిమాలకు కూడా చివరికి లెక్కలు మారిపోతుంటాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అన్నపుడు ఆ సినిమా మిడ్ రేంజ్ మూవీనే అనుకున్నారు చాలామంది. మారుతికి అలవాటైన హార్రర్ కామెడీ జానర్లోనే ఈ సినిమా తీశాడు. అయినా సరే బడ్జెట్ రూ.400 కోట్లు దాటిపోయింది.
భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా కావడం.. పెద్ద ఎత్తున సెట్స్ వేయడం.. దేశ విదేశాల్లో చిత్రీకరణ జరపడం.. పెద్ద కాస్టింగ్ ఉండడంతో బడ్జెట్ హద్దులు దాటిపోయింది. అయినా సరే అక్కడున్నది ప్రభాస్ కాబట్టి బిజినెస్‌కు ఢోకా ఉండదు. ప్రభాస్ సినిమా అంటే బయ్యర్లు ఎగబడి కొంటారు. ‘రాజాసాబ్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రలో రూ.85 కోట్లు, రాయలసీమలో రూ.40 కోట్లు, నైజాంలో రూ.70 కోట్లు పెట్టి రైట్స్ తీసుకుంటున్నారట. ఎంత ప్రభాస్ సినిమా అయినా సరే.. సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య రాబోతున్న నేపథ్యంలో ఈ మేర షేర్ రాబట్టడం అంత తేలిక కాదు. ముఖ్యంగా నైజాం వ్యవహారం చాలా రిస్కీగా అనిపిస్తోంది. ఏపీలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలకు ఢోకా లేదు. కానీ తెలంగాణలో ఓజీ, అఖండ-2 చిత్రాలకు రేట్లు పెంచడంపై కేసులు పడ్డాయి. కోర్టుల్లో ఇబ్బందులు తప్పలేదు.
స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి మీడియా ముందుకు వచ్చి ఇకపై రేట్లు పెరగవని తేల్చేశారు. బెనిఫిట్ షోలు కూడా సందేహమే అంటున్నారు. కానీ రూ.70 కోట్ల షేర్ టార్గెట్ ఉండగా బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు లేకుండా వర్కవుట్ చేయడం కష్టమవుతుంది. పెద్దగా పోటీ లేకపోతే లాంగ్ రన్‌తో సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టుకునే అవకాశముంటుంది.
కానీ సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉంది. ప్రేక్షకులకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ‘మన శంకర వరప్రసాద్’ సహా మిగతా సినిమాలు రేట్లు లేకపోయినా తట్టుకోగలవు కానీ.. ‘రాజాసాబ్’కు మాత్రం నైజాంలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలు లేవంటే ఈ రేటు రిస్కే. జీవో తెచ్చుకోలేని పరిస్థితి వస్తే ఈ రేటును రివైజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్ కోరడం ఖాయం.
This post was last modified on December 16, 2025 11:14 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…