ఆయన కోటీశ్వరుడి కుమారుడు. ఎండకన్నెరుగని ఫ్యామిలీ. అయితే.. ఇప్పుడు కారణాలు ఏవైనా.. కాలినడక పట్టారు. ఏకంగా.. 140 కిలో మీటర్ల దూరాన్ని పాదయాత్రగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే భారత దేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ కుమార్ అంబానీ తనయుడు.. అనంత్ అంబానీ. ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి ప్రఖ్యాత కృష్ణ క్షేత్రం ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 140 కిలో మీటర్లు కావడం గమనార్హం.
అనంత్ అంబానీ చేస్తున్న పాదయాత్రకు.. ప్రభుత్వం పలు ప్రణాళికలు చేసి.. ఆయనకు సూచనలు చేసింది. జనాలు రద్దీగా ఉన్న సమయంలో పాదయాత్ర చేయడం లేదు. కేవలం రాత్రి 11 గంటల తర్వాత.. నుంచి ఉదయం 6 వరకు మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. దీనివల్ల అనంత్ అంబానీ వ్యక్తిగత భద్రతతోపాటు.. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా వేళల్లోనే అనంత్ అంబానీ తన పాదయాత్ర చేస్తున్నారు.
కారణాలు ఏంటి?
అయితే అనంత్ అంబానీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టం కాలే దు. ఈ నెల 10న అనంత అంబానీ పుట్టినరోజు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ రోజు నాటికి ద్వారకకు చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారని అంటున్నారు. ఇక, అనంత్ అంబానీ.. వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిసిందే. ప్రస్తుతం జియో సహా రిలయెన్స్‌కు చెందిన పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెంట వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే పాదయాత్రలో పాల్గొంటున్నారు.
This post was last modified on April 1, 2025 3:44 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…