బంగ్లాదేశ్ లెజెండరీ క్రికెటర్లలో ఒకడైన తమీమ్ ఇక్బాల్ నిన్న ఓ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ మైదానంలో కుప్పకూలడం.. ఆ తర్వాత విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరడం.. అతడికి గుండెపోటు వచ్చిందని గుర్తించిన వైద్యులు అత్యవసర చికిత్స అందించడం తెలిసిందే. తమీమ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. లైఫ్ సపోర్ట్ మీద అతడికి చికిత్స జరుగుతోందని తెలిసేసరికి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కంగారు పడ్డారు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో అతనొకడు. మైదానంలో జెంటిల్‌మన్‌లా వ్యవహరించే తమీమ్‌ను అందరూ ఇష్టపడతారు.
జనవరిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్‌కు 36 ఏళ్ల వయసులోనే ఇలా జరగడం షాకింగే. దీంతో తమీమ్ క్షేమంగా బయటపడాలని అందరూ కోరుకున్నారు. తన ఆరోగ్యంపై అప్‌డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.తమీమ్‌కు వైద్యం అందించిన ఆసుపత్రి నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే.. అతడికి ప్రాణాపాయం తప్పింది. వైద్యులు సరైన సమయానికి రక్తనాళాల్లో బ్లాక్స్‌ను యాంజియోప్లాస్టీ ద్వారా తొలగించడంతో అతడికి ముప్పు తప్పింది. సోమవారం రాత్రికే తమీమ్ స్పృహలోకి వచ్చాడు. తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాడు. మంగళవారం ఉదయం అప్‌డేట్ ప్రకారం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. తమీమ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లే అని బంగ్లాదేశ్ బోర్డు వర్గాలు ఉదయం తెలిపాయి.
దీంతో తమీమ్ ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. సోమవారం మ్యాచ్ ఆడుతూ ఛాతీలో నొప్పి రావడంతో స్టేడియానికి దగ్గర్లోని కేపీజే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న తమీమ్.. అక్కడ సౌకర్యాలు బాగా లేవని వెనక్కి వచ్చేశాడట. ఈ లోపు స్టేడియం దగ్గర వేరే ఆసుపత్రికి వెళ్లేందుకు అతడి కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కానీ అది ఎక్కేలోపే తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. దీంతో మళ్లీ అంతకుముందు వెళ్లిన ఆసుపత్రికే తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసరంగా చికిత్స అందించి అతడి ప్రాణాలు కాపాడారు. అంతకుముందు వైద్యులు వద్దంటున్నా వినకుండా అతను ఆ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ప్రాణం మీదికి వచ్చింది. చివరికి తను వద్దనుకున్న ఆసుపత్రే అతడి ప్రాణాలు కాపాడింది.
This post was last modified on March 25, 2025 1:09 pm
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…