ఐపీఎల్ 2025 సీజన్ ఓ అద్భుతమైన మ్యాచ్‌తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది చెన్నై – ముంబై మ్యాచ్. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా, మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై టీమ్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ముంబై ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రకారం.. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బంతిపై ఏదో ఓ వస్తువుతో మానిపులేషన్ చేశాడని, ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించినట్టు చూపించారు.
వెంటనే రుతురాజ్ దానిని జేబులో వేసుకున్నట్టు వీడియో కట్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్‌కేపై శిక్షలు విధించాలని ముంబై అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో ఖలీల్ అహ్మద్ మ్యాచ్‌లో చెలరేగి ముంబై కీలక వికెట్లు తీసిన విషయం మరింత ఫైర్‌ను పెట్టింది. రోహిత్ శర్మ డకౌట్ కావడం, రికెల్టన్ క్లీన్బౌల్డ్ అవ్వడం ఈ ఆరోపణలకు బలాన్నిచ్చినట్టు నెట్టింట వాదనలు వెల్లువెత్తుతున్నాయి. “ఇది మ్యాచ్‌ను మలుపుతిప్పిన కుట్ర” అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను సీఎస్‌కే ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. వీడియో క్లియర్‌గా లేదని, అది సాధారణంగా ప్లేయర్ల మధ్య జరిగే కమ్యూనికేషన్ అవుతుందని అంటున్నారు. బహుశా ఛూయింగ్ గమ్ ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగానీ ట్యాంపరింగ్ అనేది నిర్ధారణ అవ్వాలంటే స్పష్టమైన ఆధారాలు అవసరమని అంటున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇది బిగ్ డిబేట్‌గా మారింది. మరి మ్యాచ్‌ను మరిచిపోతున్న ఈ ఆరోపణలు ఏ దిశగా పోతాయో వేచి చూడాలి.
This post was last modified on March 24, 2025 9:51 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…