Trends

చాప కింద నీరులా పాకుతున్న ఎంపురాన్

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని నిలబడగలదా అనే అనుమానం జనాల్లో లేకపోలేదు. కానీ ట్రైలర్ వచ్చాక, ఇక్కడ ప్రెస్ మీట్ జరిగాక లెక్కలు మారిపోతున్నాయి. తెలుగు వెర్షన్ కు అంత డిమాండ్ కనిపించకపోయినా మలయాళంతో సహా అన్ని భాషలు కలుపుకుని ఇప్పటిదాకా ఏడు లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయినట్టు వస్తున్న రిపోర్ట్స్ షాక్ ఇస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న మన ఆడియన్స్ ఇందులో అంత విషయముందా అంటూ ఆసక్తి పెంచుకుని మార్చి 27 మొదటి రోజు లుక్ వేసేలా ఉన్నారు.

అసలు విషయం మరొకటి ఉంది. ఎల్2 ఎంపురాన్ ని పంపిణి చేస్తోంది దిల్ రాజు. తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా ఒక రోజు ముందే వస్తుంది కాబట్టి ఎక్కుడ స్క్రీన్లు, షోలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. హిట్ టాక్ వచ్చిందా వాటిలో ఎక్కువ శాతం హోల్డ్ చేసే అవకాశం ఉంది. పోటీలో తమ చిత్రాలను దించుతున్న మైత్రి, సితారలు చిన్న బ్యానర్లు కాదు కానీ ఎంపురాన్ కనక బాగుందనే మాట తెచ్చుకుంటే వసూళ్ల పరంగా పంపకాలు తప్పవు. అలా కాకుండా రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కనక ఎక్స్ ట్రాడినరి టాక్ తెచ్చుకుంటే టెన్షన్ ఉండదు. ఎంపురాన్ ఒకవేళ యావరేజ్ అనిపించుకున్నా జనాలు మన వాటికే ప్రాధాన్యం ఇస్తారు.

సో బాక్సాఫీస్ వద్ద పోరు ఆసక్తికరంగా మారబోతోంది. ఎల్2 ఎంపురాన్ తో పోల్చుకుంటే విక్రమ్ వీరధీరశూర పార్ట్ 2 బజ్ పరంగా చాలా వెనుకబడి ఉంది. టీమ్ వచ్చి హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ చేశారు కానీ దాని ప్రభావం ఏమంత కనిపించడం లేదు. ఎస్జె సూర్యతో కల్సి విక్రమ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ట్రైలర్ కట్ బాగానే వెళ్తోంది. కానీ ఓపెనింగ్స్ తేవడానికి ఇవన్నీ సరిపోవు. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఈ పరిస్థితి వేరేలా ఉండేది. చిరంజీవి గాడ్ ఫాదర్ కన్నా లూసిఫర్ ని ఎక్కువగా ఇష్టపడిన టాలీవుడ్ మూవీ లవర్స్ లిస్టులో ఎల్2 ఎంపురాన్ అయితే ఉంది. అది ఎంత మోతాదనేది పూర్తి బుకింగ్స్ మొదలయ్యాక అర్థమవుతుంది.

This post was last modified on March 23, 2025 9:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago