బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు.
అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం 8 నెలల వయస్సులో 5 కిలోల బరువును కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోజుకు 3 కిలోల మాంసం తింటుందని సమాచారం. ఎస్. సతీష్ ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. పెంపుడు జంతువులపై అతనికి అపారమైన ఆసక్తి ఉంది. ఇప్పటివరకు 150కి పైగా వివిధ జాతుల కుక్కలను పెంచుతున్నారు. ఈ ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను ఆయన ఫిబ్రవరిలో కొనుగోలు చేశారు.
కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా 7 ఎకరాల స్థలంలో ఆధునిక సదుపాయాలతో డాగ్ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి కుక్కకు 20×20 అడుగుల గదిని కేటాయించి, వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా 6 మంది సిబ్బందిని నియమించారు. ఈ అరుదైన జాతుల కుక్కలను ప్రదర్శించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఈ కుక్కలను చూసేందుకు సతీష్ దగ్గరకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. 30 నిమిషాల ప్రదర్శనకు రూ.2.5 లక్షలు, 5 గంటల పాటు ప్రదర్శనకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో కూడా సతీష్ రూ.27 కోట్లకు చౌ చౌ జాతి కుక్కను కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.
This post was last modified on March 21, 2025 5:04 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…