నల్గొండలో ప్రేమ వివాహం చేసుకుని పరువు హత్యకు గురైన ప్రణయ్‌కి సంబంధించిన కేసులో ఇటీవలే తీర్పు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-1 అయిన మారుతీరావు కొన్నేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. సుపారీ తీసుకుని హత్యకు పాల్పడిన ఎ-2కు ఉరి శిక్ష విధించింది కోర్టు. ఇంకో ఐదుగురికి ఈ కేసులో జీవిత ఖైదు పడింది. దీనిపై గత రెండు మూడు రోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రణయ్ హత్య కేసు నిందితులకు శిక్షలు పడడం పట్ల అతడి కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమైంది. మరోవైపు అమృత బాబాయికి జీవిత ఖైదు పడ్డ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు.. అమృతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రణయ్ హత్య కేసు విషయమై తీర్పు వచ్చిన కొన్ని రోజులకే అమృత తన ఇన్‌స్టా ఐడీలో పేరును మార్చేయడం చర్చనీయాంశం అయింది. ఇన్నాళ్లూ అక్కడ ఆమె పేరు అమృత ప్రణయ్ అని ఉండేది. కానీ ఇప్పుడు ‘అమృత వర్షిణి’ అని మారిపోయింది. తన ఐడీ నుంచి ప్రణయ్ పేరును తీసేయడం ఫాలోవర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణయ్ హత్య కేసు తీర్పు అనంతరం ‘రిప్’ అని ఒక మెసేజ్ పెట్టి సైలెంట్ అయిపోయింది అమృత.
తీర్పు నేపథ్యంలో ఇక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అమృత భావిస్తోందనే చర్చ జరుగుతోంది. అందుకే ప్రణయ్ పేరును తన ఐడీ నుంచి తొలగించినట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆమె ఫాలోవర్లు, నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికప్పుడు ఈ పనిచేయాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఆమెకూ ఒక కొత్త జీవితం అవసరం కదా, ఇందులో తప్పేముంది అంటున్న వాళ్లూ ఉన్నారు.
This post was last modified on March 13, 2025 9:37 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…