బాలీవుడ్ సూపర్ స్టార్లలో హిట్ అత్యవసరం అయిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఈ కండల వీరుడి సినిమాలు యావరేజ్ టాక్‌తోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసేవి. మినిమం ఓపెనింగ్స్ గ్యారెంటీ అన్నట్లుండేది. కానీ వరుసగా ఫ్లాపులు పడడంతో సల్మాన్ జోరు తగ్గిపోయింది. టాక్ తేడా కొడితే సల్మాన్ సినిమాలు డిజాస్టర్లు అయిపోతున్నాయి. రెండేళ్ల కిందట ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ‘టైగర్ 3’ సైతం సరిగా ఆడలేదు. దీంతో సల్మాన్, ఆయన అభిమానుల ఆశలన్నీ.. మురుగదాస్ మూవీ ‘సికందర్’ మూవీ మీదే ఉన్నాయి. ఐతే ఇటీవల రిలీజైన టీజర్, సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోవడం సందేహంగానే కనిపిస్తోంది.
ఈ సినిమాలో కొన్ని విజువల్స్ చూస్తే.. మురుగదాస్ తమిళ చిత్రం ‘సర్కార్’ గుర్తుకు వచ్చింది.విజయ్ హీరోగా మురుగదాస్ తీసిన ‘సర్కార్’ యావరేజ్‌గా ఆడింది. అలాంటి సినిమాను సల్మాన్‌తో రీమేక్ చేయడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ఐతే మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా మురుగదాస్ స్పందించాడు. ‘సికందర్’.. ‘సర్కార్’ సహా ఏ చిత్రానికీ రీమేక్ కాదని ఆయన స్పష్టం చేశాడు. ఇది ఒరిజినల్ స్టోరీనే అని.. కొత్తగా కథ రాసి సినిమా తీశానని మురుగదాస్ తెలిపాడు. ఈ ప్రకటన సల్మాన్ అభిమానులకు కొంత ఊరటనిస్తోంది.
ఒకప్పుడు రీమేక్ చిత్రాలతో సల్మాన్ పెద్ద హిట్లు కొట్టాడు. కానీ ఈ మధ్య ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్లు ఎవరికీ సౌత్ రీమేక్‌లు కలిసిరావడం లేదు. అందుకే స్ట్రెయిట్ మూవీసే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే స్ట్రెయిట్ మూవీనా, రీమేకా అన్నది పక్కన పెడితే.. ‘స్పైడర్’ దగ్గర్నుంచి వరుసగా డిజాస్టర్లు ఇస్తున్న మురుగదాస్.. ‘సికందర్’తో ఏమేర బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది చూడాలి. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో విడుదలవుతోంది.
This post was last modified on March 9, 2025 3:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…