విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలోని ఒక హోటల్ గదిలో మరణించిన ఎన్ఆర్ఐ మహిళ ఉదంతం షాకింగ్ గా మారింది. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉండటం.. భర్త.. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ అంశాన్ని పోలీసులు సైతం సీక్రెట్ గా ఉంచటం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం ఆమె మరణిస్తే.. శనివారం వెలుగు చూడటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఆమె మరణం సహజ మరణమని.. ఆత్మహత్య అని.. కాదు హత్య అంటూ సాగుతున్న చర్చ పలు సందేహాలకుతావిస్తోంది.
సీతమ్మధారకు చెందిన మహిళ (48) అమెరికాలో స్థిరపడ్డారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీధర్ (52) కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. ఆయనతో మహిళకు స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల క్రితం విశాఖకు వచ్చిన శ్రీధర్ ఆ హోటల్ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఎన్ఆర్ఐ మహిళ ద్వారకానగర్ లోని ఒక ప్రైవేటు స్థలం లీజ్ అగ్రిమెంట్ చేసుకోవటానికి ఇటీవల అమెరికా నుంచి వచ్చారు.
ఆమె కూడా శ్రీధర్ ఉంటున్న హోటల్ గదిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాత్రూంలోని షవర్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లుగా శ్రీధర్ ఫిర్యాదు చేసినట్లుగా విశాఖ త్రీ టవున్ సీఐ చెబుతున్నారు. బాత్రూంలో ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవని.. ఆమె అనారోగ్యంతో మరణించినట్లుగా మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. డాక్టర్ శ్రీధర్ ఫోన్ లో ఉన్న మహిళ వీడియోలపై వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా సమాచారం.
ఈ క్రమంలో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే హత్యకు గురయ్యారా? అన్నది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం టైంకు డెడ్ బాడీ ఉబ్బిపోయి ఉండటం.. దుర్వాసన వస్తోందని మార్చురీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మహిళ భర్త అమెరికా నుంచి విశాఖకు రానున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ మరణం వెనుకున్న అసలు కారణం బయటకు రావటం ఖాయమంటున్నారు. ఈ అనుమానాస్పద మరణం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on March 9, 2025 11:35 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…