భారత క్రికెట్లో ప్రస్తుతం కోహ్లి, ధోనీల తర్వాత అత్యధికంగా అభిమానులున్న క్రికెటర్ రోహిత్ శర్మనే. దేశవ్యాప్తంగా అతడికి కోట్లాదిగా అభిమానులున్నారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బెస్ట్ లిమిటెడ్ ఓవర్స్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు రోహిత్. వన్డే, టీ20 ఓపెనర్లలో అతనే ది బెస్ట్ అన్నా కూడా అతిశయోక్తి కాదు. టీమ్ఇండియాకు వన్డేలు, టీ20ల్లో అతను వైస్ కెప్టెన్ కూడా.
ఐపీఎల్లో రోహిత్ ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఐపీఎల్ అతడి జట్టు ముంబయి ప్లేఆఫ్ దిశగా దూసుకెళ్తున్న తరుణంలో అందరూ ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. రోహిత్ ఈ ఐపీఎల్లో ఇకపై ఆడబోడు. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ ఆడలేదు. రోహిత్ గాయం చిన్నదే, త్వరలోనే జట్టులోకి తిరిగొస్తాడు.. ప్లేఆఫ్స్‌లో జట్టును నడిపిస్తాడు. మరో కప్పు అందిస్తాడు అని అభిమానులు ఆశించారు.
కానీ రోహిత్ తొడ కండరాల గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అతను ఐపీఎల్ మొత్తానికి మాత్రమే కాదు.. త్వరలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరం అవుతున్నాడని తేలింది. తాజాగా ఈ పర్యటన కోసం భారత టీ20, వన్డే, టెస్టు జట్లను ప్రకటించగా.. ఆ మూడింట్లోనూ రోహిత్‌కు చోటు దక్కలేదు.
యూఏఈలో ఉన్న భారత ఫిజియో బృందం రోహిత్‌ను పరిశీలించి అతను రెండు మూడు నెలల పాటు క్రికెట్ ఆడలేడని తేల్చింది. దీంతో సెలక్టర్లు అతణ్ని ఆస్ట్రేలియా పర్యటనకు దూరం పెట్టారు. అంతకంటే ముందు ఐపీఎల్లో ముంబయి జట్టుకు రోహిత్ దూరం కావడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే. కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ లేకపోవడమూ జట్టుకు ఎదురు దెబ్బే. అభిమానులకు బాధ కలిగించేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates