ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అక్కడ ప్రజలు అనుభవించే జీవితానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ప్రభుత్వ నియంత్రణలో ప్రతి చిన్న విషయంలోనూ కఠిన నియమాలు అమలులో ఉంటాయి. బయట ప్రపంచం చూస్తున్న కథలే వేరైతే, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నిజాలు మిగతా ప్రపంచానికి అస్సలు తెలియవు. తాజాగా నార్త్ కొరియాలో జన్మించి, అక్కడి నుంచి తప్పించుకున్న టిమోతి చో అనే వ్యక్తి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అక్కడ ఒక కొత్త టీవీ కొనాలన్నా సరే, అది ప్రభుత్వ అనుమతితోనే కొనాలి. టీవీని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ప్రభుత్వం తరఫు అధికారులు వచ్చి అన్ని యాంటెన్నాలను తొలగించి, ఒకే ఒక్క యాంటెన్నా మిగిల్చేస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ అనుమతినిచ్చిన ఛానళ్ మాత్రమే చూడాలి. టీవీలో 24 గంటలూ కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని ప్రశంసించే ప్రోగ్రామ్‌లు, పాటలు, డాక్యుమెంటరీలు మాత్రమే ప్రసారం అవుతాయి.
టీవీలే కాదు, సాధారణంగా చిన్న పిల్లలు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు రకాలు మాత్రమే లభిస్తాయి. దాని కంటే ఒక్క సెంటీమీటర్ ఎక్కువ జుట్టు పెంచినా తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కఠినంగా హెచ్చరిస్తారు. ప్రతి జాతీయ పండుగకు ప్రజలు తప్పనిసరిగా కిమ్ కుటుంబ విగ్రహాల వద్ద మోకాళ్ల మీద వంగి నమస్కరించాలి. ఈ ఆచారాలను ఎవరైనా పాటించకపోతే వారి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
నార్త్ కొరియాలో జన్మించి అక్కడి కఠిన నియమాల నుంచి తప్పించుకోవడం చాలా అరుదైన విషయం. 1950ల నుంచి ఇప్పటి వరకు 30,000 మంది మాత్రమే నార్త్ కొరియా నుంచి తప్పించుకుని దక్షిణ కొరియా, చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లగలిగారు. టిమోతి చో కూడా అదే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య చేసినా అక్కడి ప్రజలకు తీవ్ర శిక్షలు విధిస్తారు. ఈ నేపథ్యంలో, నార్త్ కొరియాలో జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే.. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో ప్రజలకు తెలియదు.
This post was last modified on March 7, 2025 9:40 am
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…