టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన బ్యాటింగ్ ప్రెజెన్స్‌తో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని వీరాభిమానుల్లో ఒకరుగా కనిపించిన జాస్మిన్ వాలియా, హార్దిక్‌కు ప్రత్యేకంగా హార్దిక అభినందనలు తెలిపిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆమె హార్దిక్ సిక్సర్లకు స్టాండ్స్‌లోంచి చప్పట్లు కొడుతూ అతనికి మద్దతు ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. కేవలం 28 పరుగులే చేసినా, అందులో మూడు సిక్సులు ఉండటంతో ఆట రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ సిక్సులు కొట్టిన సమయంలో స్టేడియంలోని కెమెరాలు జాస్మిన్ వైపు తిరగడం విశేషం. ఆమె ఆనందంతో చప్పట్లు కొట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్షణాలు హార్దిక్ బ్యాటింగ్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఇతర కారణాలతోనూ హార్దిక్ పేరు వార్తల్లో నిలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియాకు ఎదురైన ఓటమికి చిన్న ప్రతీకారం తీర్చుకున్నట్లు ఈ విజయం కనిపించింది. అదే సమయంలో, హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాన్కోవిచ్ పుట్టినరోజు జరుపుకుంటుండడం సోషల్ మీడియాలో మరో చర్చకు దారి తీసింది. ఆమె తన కొడుకు అగస్త్యతో కలిసి సింపుల్ బర్త్‌డే సెలబ్రేషన్ జరిపినట్లు వార్తలు వచ్చాయి.
హార్దిక్, జాస్మిన్ మధ్య రిలేషన్ గురించి గతేడాది నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి. నటాషా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్, జాస్మిన్ లైఫ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి కనిపిస్తూ ఉన్నప్పటికీ, అధికారికంగా బయటికి రావడం ఇదే తొలిసారి. జాస్మిన్ స్టేడియంలో ప్రత్యక్షంగా హార్దిక్‌కు మద్దతుగా ఉండటం, వారి బంధాన్ని బహిరంగంగా అంగీకరించినట్లే అనేలా కామెంట్స్ వస్తున్నాయి. మరి హార్దిక్ ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.
This post was last modified on March 5, 2025 2:57 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…