Trends

AWS: మొన్న తెలంగాణ – నేడు మహారాష్ట్ర.. ఏపీకి ఎప్పడు?

భారతదేశంలో పెట్టుబడుల ప్రవాహం కొత్త గమ్యస్థానాలను ఆకర్షిస్తోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ పెట్టుబడులు పెట్టనుంది. రూ.68 వేల కోట్లతో (8.2 బిలియన్ డాలర్లు) మహారాష్ట్రలో AWS డేటా సెంటర్ల విస్తరణను ప్రకటించింది. ఇదే తరహాలో ఇటీవలే తెలంగాణకు కూడా రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలు వరుసగా ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడంలో విజయం సాధించాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అనేది అసలు ప్రశ్న. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిగా దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు గత అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హైడ్రోజన్ ఎనర్జీ నుంచి, గ్రీన్ ఇండస్ట్రీలు, ఐటీ పార్క్‌ల వరకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ, పెట్టుబడులు ఆకర్షించడానికి సరైన పారదర్శక విధానాలు, ప్రణాళికలు, విధివిధానాలు అవసరం.

గతంలో వైసీపీ హయాంలో లులూ మాల్ ప్రాజెక్ట్ రద్దు కావడం, కొన్నిరకాల వ్యాపార పెట్టుబడులు వెనుకబడడం ఏపీకి ప్రతికూలంగా మారింది. AWS లాంటి కంపెనీ ఏపీకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ లాంటి పెద్ద ప్రాజెక్టులు ఒకసారి ఎక్కడైతే స్థాపించబడతాయో, అక్కడ మరికొన్ని కంపెనీలు సహజంగానే వస్తాయి. ఇది ఇతర ఐటీ కంపెనీలను, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత పురోగమించేలా చేస్తుంది.

హైదరాబాద్ నేడు ఐటీ హబ్‌గా ఎదగడానికి గల ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ మొదలైన కంపెనీల పెట్టుబడులు. అలాంటి స్థాయిలో ఏపీలోనూ పెట్టుబడులు రావాలంటే, ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.అయితే గత ఏడాది లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెజాన్ ఇన్వెస్టర్లతో చర్చలు జరిపారు.

అయితే సమీప భవిష్యత్తులో మాత్రం AWS వంటి కంపెనీలు ఏపీ వైపు కూడా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి వంటి ప్రాంతాలు ఐటీ హబ్‌గా ఎదగడానికి అవకాశం ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. సరైన విధానాలను తీసుకురాగలిగితే, ఏపీ మరో ఐటీ డెస్టినేషన్‌గా మారవచ్చు.

This post was last modified on March 4, 2025 9:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

6 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

7 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

8 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

11 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

12 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

12 hours ago