Trends

కుంభమేళా… మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు?

ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమాగమంగా పేరుగాంచిన మహాకుంభమేళా తాజాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి భక్తుల రద్దీ గత రికార్డులను అధిగమించి, 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్షరాల అమెరికా జనాభాకు రెట్టింపు స్థాయిలో భక్తులు తరలిరావడం విశేషంగా నిలిచింది. ఆధ్యాత్మికత, భక్తి, సంస్కృతీ సమ్మేళనంగా కొనసాగిన ఈ మహాకుంభమేళా మరికొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మహాకుంభమేళా ముగిసిన వెంటనే భక్తుల మనసులో వచ్చే ప్రశ్న – తదుపరి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ?.. అయితే వచ్చే కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగనుంది. ఇది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. నాసిక్‌కు 38 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో గోదావరి నదీ తీరంలో ఈ మేళా జరగనుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర శివాలయం ఇక్కడే ఉండడం వల్ల ఈ మేళాకు మరింత ప్రాముఖ్యత ఉంది. ఈసారి అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మరింత విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కుంభమేళా పద్ధతి గురించి తెలిసిన వారు ఈ మేళా మళ్ళీ మూడేళ్లకే మరోసారి ఎందుకు వస్తోందో అని ప్రశ్నించవచ్చు. అయితే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే, 12 ఏళ్లకు ఒకసారి జరిగేదే పూర్తి కుంభమేళాగా పరిగణిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మేళానే మహాకుంభమేళాగా పిలుస్తారు. ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ముగిసిన నేపథ్యంలో, 2027 నాటికి నాసిక్‌లో జరిగే మేళా సాధారణ కుంభమేళాగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులే కాకుండా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈసారి మహాకుంభమేళాకు హాజరయ్యారు.

అంతర్జాతీయంగా కూడా ఈ మహాసభ ప్రాధాన్యతను పెంచుతూ, 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తలు ఈ మహా మేళాలో భాగమయ్యారు. మొత్తంగా, 2025 మహాకుంభమేళా భక్తులకు స్మరణీయంగా నిలిచిపోయింది. అయితే, ఈ పవిత్ర మహోత్సవాన్ని మళ్లీ అనుభవించాలనుకునే భక్తులు 2027 నాటికి నాసిక్‌లో జరిగే కుంభమేళాకి సిద్ధమవ్వవచ్చు.

This post was last modified on March 1, 2025 4:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎన్టీఆర్ నీల్ – మారిన విడుదల తేదీ ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…

5 hours ago

బచ్చన్ గాయాన్ని గుర్తు చేసిన రైడ్ 2

మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…

5 hours ago

పెద్ద కొడుకు పుట్టిన రోజే.. చిన్న కొడుకుకు ప్రమాదం: పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…

8 hours ago

త్రివిక్రమ్ ట్రీట్ ఎక్కడ?

ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…

8 hours ago

ఆ ప్రమాదం ఓ ప్రాణం తీసింది.. పవన్ వెనకాలే సింగపూర్ కు చిరు

సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…

8 hours ago

మోదీకి.. బాబు, జగన్ కూ ధన్యవాదాలు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…

8 hours ago