Trends

హర్దిక్ వాచ్ ఇన్ని కోట్లా…

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ ఎప్పుడూ కూడా హై వోల్టేజ్ వైబ్ తోనే ఉంటుంది. కానీ, ఈసారి దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో హార్దిక్ పాండ్యా ఆటతో మాత్రమే కాదు, తన చేతికి ఉన్న లిమిటెడ్ ఎడిషన్ వాచ్ తోనూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వాచ్ విలువ సుమారుగా 7 కోట్లు కావడం, అది రేర్ పీస్ కావడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది.

హార్దిక్ చేతికి మెరిసిన ఈ వాచ్చ్ రిచర్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందిన RM 27-02 మోడల్. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 పీసులు మాత్రమే ఉత్పత్తి చేసిన ఈ వాచ్ అసలు విలువ సుమారుగా 800,000 డాలర్లు, అంటే సుమారుగా 6.93 కోట్లు. కార్బన్ టీపీటీ అన్‌బాడీ బేస్‌ప్లేట్, గ్రేడ్ 5 టైటానియం బ్రిడ్జ్‌లు, 70 గంటల పవర్ రిజర్వ్ వంటి ఆధునిక ఫీచర్లతో ఈ వాచ్చ్ అద్భుత ఇంజనీరింగ్ కలిగిన మోడల్‌గా నిలుస్తుంది.

రెఫెల్ నాదల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వాచ్చ్ స్పోర్ట్స్ వేర్‌గా మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా విప్లవాత్మకంగా ఉంది. క్వార్ట్జ్ టీపీటీ కేసు, యాంటీ-గ్లేర్ సఫైర్ క్రిస్టల్, కార్బన్, క్వార్ట్జ్ ఫైబర్ నిర్మాణం వంటి ఫీచర్లు దీన్ని అత్యంత బలమైన హై ఎండ్ వాచ్చ్‌లలో ఒకటిగా మార్చాయి. 50 పీసులు మాత్రమే తయారైన ఈ వాచ్చ్ లిమిటెడ్ ఎడిషన్ కావడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది.

హార్దిక్ పాండ్యా కేవలం ఫీల్డ్‌పైనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లో కూడా తన లైఫ్‌స్టైల్, లగ్జరీ వస్తువుల ద్వారా ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాడు. అతని వాచ్ కలెక్షన్‌లో అనేక హై-ఎండ్ మోడల్స్ ఉన్నాయి. ఈ వాచ్ మాత్రం ప్రత్యేకం, ఎందుకంటే ఇది కేవలం లుక్స్ మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగానూ అగ్రస్థానంలో ఉంటుంది.

మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌ను అవుట్ చేసి, హార్దిక్ పాండ్యా విజయోత్సాహంతో చేతులు ఎగరేసినప్పుడు, అతని చేతికి ఉన్న ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్చ్ అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాండ్యా ఆటపై కన్నా, అతని వాచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుందంటే ఈ టాపిక్ ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on February 24, 2025 6:40 pm

Share

Recent Posts

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 minutes ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

1 hour ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

2 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

2 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

3 hours ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

4 hours ago