Trends

వీడియో : పెళ్ళి బట్టలతోనే పరీక్షా కేంద్రానికి ఉద్యోగార్ధిని!

ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైపోయింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఇదివరకే జరిగిన ప్రిలిమ్స్ కు హాజరైన వారిలో 93 దాకా మెయిన్స్ కు అర్హత సాధిస్తే… వారిలో శనివారం రాత్రికే 84 వేల మంది అభ్యర్థుల దాకా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. రోస్టర్ విధానంపై నెలకొన్న వివాదంతో పరీక్షలు వాయిదా పడతాయంటూ ప్రచారం జరిగినా… ఏర్పాట్లన్నీ చేశాక వాయిదా వేయలేమంటూ ఏపీపీఎస్సీ ఒకంత కఠినంగా నిలబడటంతో ఆదివారం పరీక్షలు ప్రారంభమైపోయాయి.

హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారంటే… అలాంటి వారంతా పరీక్షకు సిద్ధమైన వారి కిందే లెక్క. మరి ఆదివారం నాటి పరీక్షకు ఎంతమంది హాజరయ్యారన్న విషయం సాయంత్రానికి గాని తెలియదు. అయితే ఈ పరీక్షలు రాసేందుకు ఓ యువతి పెళ్లి దుస్తుల్లో పరీక్షా కేంద్రానికి వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఘటన తిరుపతి నగనంలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద ఈ ఆసక్తికర ఘటన కనిపించింది. పెళ్లి దుస్తులే కాదు… ఏకంగా జీలకర్ర బెల్లంతో కూడిన తమలపాకును తలపై పెట్టుకుని మరీ ఆ యువతి పరీక్ష రాసేందుకు వచ్చారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు నగరానికి చెందిన నమిత గ్రూప్ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇదివరకే జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన ఆమె… మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే మెయిన్స్ పరీక్షలు జరిగేలోగానే ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అస్పష్టత నెలకొనడంతో ఆదివారం (ఫిబ్రవరి 23)న మంచి ముహూర్తం ఉండటంతో అదే రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తీరా పరీక్ష వాయిదా పడలేదు. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటించిన ఏపీపీఎస్సీ… అనుకున్నట్లుగానే పరీక్షను నిర్వహించింది.

ఎలాగూ నిర్ణయించుకున్న మేరకు వివాహ వేడుక జరిగిపోయింది కదా.. కష్టపడి చదివి ఇప్పటికే ప్రిలిమ్స్ పాస్ అయ్యి..మెయిన్స్ కు కూడా బాగానే ప్రిపేర్ అయ్యాను కదా… పరీక్షకు హాజరైన ఉద్యోగం రాపోతుందా? అని నమిత ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ఇదే విషయాన్ని తన జీవిత భాగస్వామిగా మారిపోయిన భర్తకు చెబితే.. ఆయన కూడా సరేనన్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పెళ్లి జరిగితే… పొద్దున్నే పరీక్ష ఉంది. తలపై జీలకర్ర,బెల్లం తీయొద్దని పండితులు చెప్పినట్టున్నారు… దీంతో తలపై జీలకర్ర, బెల్లంతో కూడిన తమలపాకును అలా తలపైై పెట్టుకుని ఆమె ఎగ్జామ్ సెంటర్ కు వచ్చేశారు. భర్తతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకుని అలా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లిపోయారు. ఈ వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

This post was last modified on February 23, 2025 3:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago