సంచలనంగా మారిన మస్తాన్ సాయి ఉదంతానికి సంబంధించి పోలీసులు కీలక విషయాల లెక్క తేల్చారు. పెద్ద ఎత్తున మహిళల వీడియోలు వేలాదిగా అతను దాచుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలతో సదరు అమ్మాయిల్ని బ్లాక్ మొయిల్ చేసేవాడని.. పెద్ద ఎత్తున డబ్బులు గుంజేవాడని.. వేధింపులకు గురి చేసినట్లుగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఆమె ఇచ్చిన హార్డ్ డిస్క్ ను విశ్లేషించిన నార్సింగ్ పోలీసులు కీలక అంశాల్ని గుర్తించారు. అదే సమయంలో అతడ్ని కస్టడీలో తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా డగ్ర్స్ విషయానికి సంబంధించి మాత్రం నోరు విప్పలేదని.. ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదని తేల్చారు. డ్రగ్స్ పార్టీకి వచ్చే వారి వివరాలపై కూడా అతను సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే.. వీడియోలు చూపిస్తే.. వారి వివరాలు చెప్పగలనని చెప్పినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా.. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ను విశ్లేషించగా మొత్తం ఆరుగురు యువతులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 499 వీడియోలు ఉన్నాయని.. వీటిని గడిచిన మూడేళ్లుగా దాచినట్లుగా తేల్చారు. ఆరుగురు మహిళలకు సంబంధించి.. వారు వీడియో కాల్స్ చేసినప్పుడు వారికి తెలీకుండా స్క్రీన్ రికార్డింగ్ చేశాడని.. ఇదే రీతిలో లావణ్య ఆమె స్నేహితుల్ని కూడా లోబర్చుకున్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. హార్డ్ డిస్కులో కొన్ని సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకొని.. ఇతరులు ఎవరూ తన వీడియోల్ని చూడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని గుర్తించారు.
This post was last modified on February 23, 2025 1:03 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…