Trends

గాడిత‌ప్పిన యూట్యూబర్స్ ఆర్జ‌న కోసం అడ్డ‌దారులు!

సామాజిక మాధ్య‌మాల్లో అత్యంత బ‌ల‌మైన‌.. క్ష‌ణాల్లోనే ఆక‌ర్షించ‌గ‌ల స‌త్తా ఉన్న మాధ్య‌మం యూట్యూబ్‌. దీనికి చ‌దువుతో ప‌నిలేదు. కేవ‌లం ఒక్క క్లిక్ తో వీక్షించే స‌దుపాయం.. వినే అవ‌కాశం రెండు ఉన్నాయి.

దీంతో పండితుల నుంచి పామ‌రుల వ‌ర‌కు ఇత‌ర సామాజిక మాధ్య‌మాలైన ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా వంటి వాటికంటే.. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న మాధ్య‌మంగా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో ఆదాయం సంపాయించుకునే అవ‌కాశం లేదు.

యూట్యూబ్ విష‌యానికి వ‌స్తే.. సొంత‌గా ఛానెళ్లు క్రియేట్ చేసుకుని నెల‌నెలా వీవ‌ర్స్‌ను బ‌ట్టి ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్జించే వెసులు బాటు ఉంది. నిరుద్యోగ యువ‌త‌కే కాదు.. ఇంట్లో ఉండే మ‌హిళ‌ల‌కు కూడా.. ఇది ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతున్న అంశం.

కుటీర ప‌రిశ్ర‌మగా నేడు వ‌ర్ధిల్లుతున్న యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోల నుంచి నిడివి ఎక్కువ‌గా ఉన్న వీడియోల వ‌ర‌కు.. ఆర్జ‌నకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో ఆర్జ‌నే ల‌క్ష్యంగా యూట‌బ‌ర్లు కొంద‌రు.. చేస్తున్న వీడియోలు అత్యంత జుగుప్సాక‌రంగా ఉంటున్నాయ‌నేది పబ్లిక్ టాక్‌!

అత్యంత నీచ‌మైన వీడియోలు కూడా యూట్యూబ్‌లో వెలుగు చూస్తున్నాయి. దీనిలో యువ‌తుల పాత్రను ప‌క్క‌న పెట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తొలినాళ్ల‌లో విద్యార్థుల‌కు, యువ‌త‌కు ఉప‌యోగ‌ప‌డేలా.. అనేక వీడియోలు యూట్యూబ్ లో వ‌చ్చేవి.

త‌ర్వాత‌.. త‌ర్వాత‌.. వీవ‌ర్స్‌, లైకుల ఆధారంగా ఆదాయ మార్గం గా యూట్యూబ్ ఏర్ప‌డ‌డంతో అన‌తి కాలంలో ఇది గాడి త‌ప్పింది. ద్వంద్వార్థ ప‌దాలు.. వీడియోలు.. జుగుప్సాక‌ర కంటెంట్‌తో ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ నుంచి వీడియోల వ‌ర‌కు.. పెను ప్ర‌మాదంగా మారిపోయింది.

యూట్యూబ్‌లో చూసి రేప్‌లు చేయ‌డం, హ‌త్య‌లు చేయ‌డం.. వంటివి కామ‌న్‌గా మారిపోయాయి. అంతేకాదు.. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో వెలుగు చూసిన ఓ ఘ‌ట‌న అయితే.. మ‌రింత ఆశ్చ‌ర్యంగా మారింది. కాలేజీకి వెళ్లిన యువ‌తి.. చేసిన పాడు ప‌ని.. యూట్యూబ్ నుంచే నేర్చుకున్న‌ట్టు చెప్ప‌డం పోలీసుల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇంటిల్లిపాదీ కూర్చుని చూసేందుకు సినిమాలు ఎలా అయితే..లేవో.. ఇప్పుడు యూట్యూబ్ ప‌రిస్థితి కూడా అలానే మారిపోయింద‌ని అంటున్నారు. ఇదంతా కేవ‌లం ఆర్జ‌న కోసం తొక్కుతున్న అడ్డ‌దారులుగానే ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

అశ్లీల నృత్యాలు.. అశ్లీల డైలాగులు.. మ‌హిళ‌లు దుస్తులు మార్చుకోవ‌డం.. వంటివి కూడా.. యూట్యూబ్ లో నిత్య‌కృత్యంగా మారాయి. అంద‌రూ కాక‌పోయినా.. కొంద‌రు చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాలు.. స‌మాజానికి చేటు చేస్తాయ‌ని అంటున్నారు.

కేంద్రానికి సెన్సార్ హ‌క్కులు ఉన్నా.. ఫిర్యాదు చేస్తే త‌ప్ప స్పందించ‌ని ల‌క్ష్మ‌ణ రేఖ అశ్లీల యూట్యూబ‌ర్ల‌కు వ‌రంగా మారింది. దీంతో యూట్యూబ్ గాడిత‌ప్పుతోంద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 17, 2025 2:20 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Youtube

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

43 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

55 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago