రణవీర్ అహ్మదిబాదీ…ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యువతీయువకులు గుమిగూడినా… ఇతడిపైనే చర్చ సాగుతోంది. ఆధునిక కాలం యువతకు ప్రతినిధిగా తనను తాను చెప్పుకునే రణవీర్.. హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రుల శృంగారంపై అసందర్భ వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నాడు. ఆపై తప్పు తెలుసుకుని బహిరగంగానే సారీ కూడా చెప్పాడు. రణవీర్ చెప్పిన సారీని జనం అంగీకరింంచలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిన్నటిదాకా యమా యాక్టివ్ గా సాగిన రణవీర్ ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నాడు.
శనివారం రణవీర్ సోషల్ మీడియా వాల్ పై కనిపించిన ఓ పోస్ట్… అతడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. సదరు పోస్టులో తనకు ఎలాంటి బెదిరింపులు ఎదురవుతున్న విషయంతో పాటుగా తనకు జరిగిన నష్టాన్ని కూడా రణవీర్ వివరించాడు.
తల్లిదండ్రుల శృంగారం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని మొదలుపెట్టిన రణవీర్… అందుకు గాను తన తప్పును తెలుసుకుని సారీ చెప్పానని తెలిపాడు. అయితే ఆ తర్వాత తనను టార్గెట్ చేస్తూ పలు వర్గాలు తనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయాడు. ఈ తరహా బెదిరింపులు అంతకంతకూ పెరుగుతున్నాయని కూడా తెలిపాడు.
తనపై ఉన్న కోపాన్ని తన కుటుంబంపైనా చూపుతున్నారంటూ రణవీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్న కొదంరు వ్యక్తులు తన కుటుంబ సభ్యులను కూడా వదలబోమంటూ బెదిరిస్తున్నారని తెలిపాడు. ఇక తన తల్లి నిర్వహిస్తున్న క్లినిక్ ను టార్గెట్ చేసిన కొందరు వ్యక్తులు.. రోగుల మాదిరిగా అందులోకి దూరి దానిని సర్వనాశనం చేశారని తెలిపాడు.
ఈ పరిణామాలతో తాను వణికిపోతున్నానని తెలిపాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నాడు. అయినా తానేమీ ఎక్కడికీ పారిపోనని, ఎలాంటి పరిణామాలు అయినా ధైర్యంగానే ఎదుర్కొంటానని తెలిపాడు. భారత దేశ పోలీసులు, న్యాయ వ్యవస్థపై తనకు అపార నమ్మకం ఉందని అతడు తెలిపాడు.
This post was last modified on February 15, 2025 10:29 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…