Trends

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్.. వారి కోసమే స్ట్రాంగ్ రూల్స్!

మెటా సంస్థ భారతదేశంలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.16 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం సురక్షితమైన, వయస్సుకు తగిన అనుభవాన్ని అందించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ టీన్ ఖాతాలను (Teen Accounts) రూపొందించినట్లు మెటా ప్రకటించింది. ఈ ఫీచర్‌ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పర్యవేక్షించగలరు. ఏ కంటెంట్‌ను చూడవచ్చో, ఎంత సమయం గడపవచ్చో నియంత్రించేందుకు ప్రత్యేకమైన స్టెప్స్ విధించనున్నారు.

ముఖ్యంగా, టీనేజ్ అకౌంట్లు ప్రైవేట్‌గా ఉండడం తప్పనిసరి, అలాగే అనుమతి లేకుండా ఖాతా సెట్టింగ్‌లను మార్చుకోవడం సాధ్యం కాదు. ఇన్‌స్టాగ్రామ్ టీనేజ్ ఖాతాల కోసం ప్రత్యేక రూల్స్‌ను రూపొందించింది. టీన్స్‌ను ఫాలో అవ్వాలంటే వారి అనుమతి అవసరం. అలానే, వారి ఫాలోవర్స్ మాత్రమే మెసేజ్ చేయగలుగుతారు. ఈ ఫీచర్ 18 ఏళ్ల లోపు వినియోగదారులకు వర్తిస్తుంది.

అదనంగా, హింసాత్మక దృశ్యాలు, భౌతిక గొడవలు, కాస్మెటిక్స్ వంటి ప్రమోషనల్ మెసేజ్‌లు పిల్లల ఖాతాల్లో కనబడకుండా ఫిల్టర్ చేయనున్నారు. వారి మెన్షన్, ట్యాగ్‌లు కూడా కేవలం ఫాలోవర్స్‌ మాత్రమే చూడగలరు. ప్రతి గంటకోసారి యాప్‌లో గడిపిన సమయం గురించి రిమైండర్ వస్తుంది. అలాగే, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్ యాక్టివ్ అవుతుంది, దీనివల్ల నోటిఫికేషన్లు మ్యూట్ చేయబడతాయి.

తల్లిదండ్రులకు మరిన్ని నియంత్రణలు అందించేందుకు మెటా కొత్త సూపర్విజన్ టూల్‌ను త్వరలో ప్రారంభించనుంది. 16 ఏళ్ల పైబడి పిల్లల ఖాతాలను పర్యవేక్షించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా, వారు ఏ మెసేజ్‌లు తీసుకుంటున్నారు? ఎంత సమయం గడుపుతున్నారు? అన్న అంశాలను తల్లిదండ్రులు మానిటర్ చేయగలరు. అంతేకాదు, రోజువారీ టైం లిమిట్‌ను నిర్ణయించేందుకు కూడా వీలుగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఇండియాలో పిల్లల ఆన్‌లైన్ భద్రతపై నేరుగా ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేకపోయినా, ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ యాక్ట్ ప్రకారం పిల్లల డేటా సేకరించడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో మెటా ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసే దిశగా వెళ్తోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌, భారతదేశం కోసం కొత్త గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేస్తూ, టీనేజ్ ఖాతాలకు మరింత భద్రతను అందించేందుకు ప్రయత్నిస్తోంది.

This post was last modified on February 12, 2025 4:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

37 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

6 hours ago