అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. తాజాగా అలాస్కాలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో, గత ఎనిమిది రోజుల్లో అమెరికాలో మూడు ప్రమాదాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనా లో పైలట్‌తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో రెస్క్యూ టీం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు.
అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, బెరింగ్ ఎయిర్‌కు చెందిన సెస్నా కారవాన్ అనే విమానం గురువారం ఉనల్కలేట్ నుంచి నోమ్ నగరానికి బయలుదేరింది. ఆ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నారు. అయితే, ప్రయాణానికి అనుకూలంగా వాతావరణం లేకపోవడంతో ఘటన చోటుచేసుకుంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ హిమపాతం, పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.
యూఎస్ కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మెక్ఇంటైర్ కోబుల్ మాట్లాడుతూ, ప్రమాదం కంటే ముందు విమానం నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ రాలేదని చెప్పారు. సాధారణంగా, విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్మిటర్ అనే ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే, ఇది ఉపగ్రహానికి సంకేతాన్ని పంపుతుంది. ఆ సిగ్నల్ ఆధారంగా కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపడుతుంది. కానీ, ఈ ఘటనలో అలాంటి ఎలాంటి సంకేతాలు రాకపోవడం సందేహాలను పెంచుతోంది.
This post was last modified on February 8, 2025 1:02 pm
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…