ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే గాయాలతో మిచెల్ మార్ష్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో వెబ్ స్టర్‌ను ఎంపిక చేసే అవకాశముంది. అలాగే, కీలక బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమీన్స్ గాయాలతో కోలుకుంటూ ఉండటంతో వారి ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే ఇప్పుడు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అకస్మాత్తుగా వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా హల్క్ అని పిలుచుకుంటారు. అయితే అతను ఫిబ్రవరి 6న తన రిటైర్మెంట్ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పటికే గాయాలతో జట్టుకు ప్రధాన ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో, స్టోయినిస్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసీస్ అభిమానులను నిరాశలో ముంచేసింది. స్టోయినిస్ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే, మొత్తం 71 మ్యాచ్‌లు ఆడి 1,495 పరుగులు చేశాడు.
ఒక సెంచరీ, ఆరు అర్ధశతకాలు నమోదు చేసిన అతను, కీలకమైన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా తనదైన ముద్ర వేశాడు. బౌలింగ్‌లోనూ 48 వికెట్లు తీసి, అవసరమైన సమయంలో జట్టుకు సేవలు అందించాడు. అయితే, తన దృష్టిని పూర్తిగా టీ20 క్రికెట్‌పై కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే వన్డేలకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. అతను చివరి వన్డేను పాకిస్తాన్‌పై ఆడి, ఆ మ్యాచ్‌లో 8 పరుగులు చేశాడు.
ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో ఆస్ట్రేలియా జట్టులో సమతుల్యత దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్టోయినిస్ కూడా తప్పుకోవడంతో ఆసీస్ జట్టుకు మరింత ఒత్తిడి పెరిగింది. తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ స్టోయినిస్, “ఆస్ట్రేలియా తరపున వన్డే క్రికెట్ ఆడటం ఓ అద్భుతమైన అనుభవం. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టుకు నేను నా మద్దతు తెలుపుతాను” అంటూ తన భావోద్వేగాలను వ్యక్తం చేశాడు.
ఈ ప్రకటనతో ఆస్ట్రేలియా జట్టుకు అతను లేని లోటును తీర్చడం అంత సులభం కాదని స్పష్టమైంది. ఒక్కపక్క అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయాలతో అందుబాటులో లేకపోవడం, మరోపక్క స్టోయినిస్ వంటి కీలక ప్లేయర్ రిటైర్మెంట్ తీసుకోవడంతో, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా గట్టిగా పోటీ చేయగలదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
This post was last modified on February 6, 2025 2:18 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…