Trends

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా ‘వావ్’ అనకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. భర్తను రక్షించేందుకు పెద్ద సాహసమే చేసిందా భార్య. ఇంతకూ ఆమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 56 ఏళ్లను. భర్త కోసం సదరు భార్య పడిన తపన.. అందుకోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రయత్నం గురించి తెలిస్తే ఆమెను అభినందించకుండా ఉండలేం.

ఈ ఆసక్తికర సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఎర్నాకుళం జిల్లా పిరవమ్ పట్టణంలో జరిగింది. తమ పెరట్లో ఉన్న మిరియాల చెట్టు మీదకు ఎక్కిన 64 ఏళ్ల రమేవన్.. మిరియాల్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు.. చెట్టు కొమ్మ విరగటంతో చెట్టు పక్కనే ఉన్న 40 అడుగుల బావిలో పడిపోయారు. అంత ఎత్తునుంచి అంత లోతులోకి పడిపోయిన భర్తను చూసిన ఆయన భార్య పద్మ ఒక్కసారి షాక్ తిన్నారు.

ఇలాంటి ఘటనే మరెక్కడైనా జరిగితే.. భయంతో కేకలు వేయటం.. సాయం కోసం అడగటం లాంటివి చేస్తుంటారు. కానీ.. 56 ఏళ్ల పద్మ మాత్రం అలా చేయలేదు. యుద్ధంలో స్ప్రహ కోల్పోయిన శ్రీక్రిష్ణుడ్ని రక్షించుకోవటం కోసం సత్యభామ ఎలా అయితే తానే విల్లు పట్టి నరకాసురుడ్ని సంహరించిందో.. సరిగ్గా అలాంటి ధైర్య సాహసాల్నే ప్రదర్శించారు.

ఒక తాడు సాయంతో వెంటనే బావిలోకి దిగిన ఆమె.. అప్పటికే నీట మునిగి స్ర్పహ కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న భర్తను దాదాపు 20 నిమిషాల పాటు అలానే ఒడిసి పట్టుకొని..అందరికి వినిపించేలా గట్టిగా కేకలు వేయటం మొదలు పెట్టింది. ఆమె అరుపుల్ని విన్న చుట్టుపక్కల వారు జరిగిన విషయాన్ని పోలీసులకు.. ఫైర్ శాఖకు చెప్పటంతో వారు రంగంలోకి దిగారు. భారీ వల సాయంతో వారిద్దరిని బయటకు తీశారు.

బయటకు క్షేమంగా వచ్చిన రమేశన్ షాక్ కు గురయ్యారు. గాయాలతో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 56 ఏళ్ల వయసులో భర్త క్షేమం కోసం అంత పెద్ద సాహసం చేసిన పద్మను అందరూ అభినందిస్తున్నారు. ఏమైనా.. భర్త కోసం పురుణాల్లో సత్యభామ ధనస్సు పడితే.. ఈ కాలంలో భర్తను సేవ్ చేయటానికే 40అడుగుల లోతు బావిలో దిగటం గ్రేట్ అంటే గ్రేట్ అని చెప్పక తప్పదు.

This post was last modified on February 6, 2025 10:23 am

Share

Recent Posts

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

17 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

1 hour ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

2 hours ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

3 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

3 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

14 hours ago