Trends

ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలిచిన ట్రంప్, తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యపై సంచలన ప్రకటన చేశారు. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించిన అనంతరం గాజాపై నియంత్రణ సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపుల పోకడలు, భవిష్యత్ వ్యూహాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు ఉపాధి అవకాశాలు, స్థిర నివాస వసతులు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ, గాజాలో శాంతిని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మధ్యప్రాచ్యాన్ని సమృద్ధిగా మారుస్తామని, గాజాను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపగలనన్నారు. అయితే, గాజా ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి ముందు పాలస్తీనియన్లను రీలొకేట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పాలస్తీనియన్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ట్రంప్ పేర్కొన్నారు. గాజాలో భద్రతా పరమైన పరిస్థితులను పర్యవేక్షించేందుకు అమెరికా సైన్యాన్ని అక్కడ మోహరించే యోచన ఉందని తెలిపారు. గాజాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యమని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో భవిష్యత్ పరిస్థితులపై చర్చ మొదలైంది. ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమవుతుందా? లేక ట్రంప్ చెప్పినట్లు వాస్తవికంగా అమలవుతుందా? అన్నది చూడాల్సిన విషయమే. అయితే, గాజాపై అమెరికా పెత్తనం పెంచే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on February 5, 2025 3:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: GazaTrump

Recent Posts

నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…

8 seconds ago

నిజంగా అవ‌మానం: మోడీ మిత్రుడు ఇలా చేయ‌డ‌మేంటి?!

అగ్ర‌రాజ్యం అమెరికాలో నూత‌న అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పుడు.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…

5 minutes ago

రమేష్ బాబు కామెంట్ – బండ్ల గణేష్ కౌంటర్

ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…

5 minutes ago

టీడీపీలో ‘మంగ్లి’ మంటలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…

9 minutes ago

ఓటమి కాస్తా.. ఓదార్పు యాత్ర అయ్యిందే!

తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…

21 minutes ago

పవన్ కాల్ షీట్లు వేస్ట్ అయ్యాయా?

పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించేసి చాలా కాలం అయింది. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని…

51 minutes ago