Trends

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే దొంగను ఇటీవల మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన అతడు తన చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ బడా క్రిమినల్‌గా మారాడు. అయితే అతడి కేసులో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అతడు తన ప్రేయసి కోసం ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించడం. అంతేకాకుండా, ఆమెకు లక్షల రూపాయల విలువైన బహుమతులు కూడా అందించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, పంచాక్షరి స్వామి 2003లో దొంగతనాలు ప్రారంభించాడు. 2009 కల్లా అతడు భారీ స్థాయిలో దోపిడీలు చేస్తూ కోట్లాది ఆస్తిని కూడబెట్టాడు. 2014-15లో ఓ ప్రముఖ సినీ నటి పరిచయం కావడంతో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెపై కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు, కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు కట్టించి పెట్టాడు. అంతే కాదు, ఆమె కోసం రూ.22 లక్షల విలువైన ఫిష్ అక్వేరియం కూడా కొనుగోలు చేశాడు. అయితే, 2016లో గుజరాత్ పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.

అహ్మదాబాద్‌లోని సబర్మతి జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత కూడా అతడు మారలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక, మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర పోలీసులు అతడిని మళ్లీ అరెస్టు చేశారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం 2024లో బెంగళూరుకు వచ్చి మడివాళ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. జనవరి 9న అక్కడ ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అతడిని, స్థానిక పోలీసులు ఇంటెలిజెన్స్ ఆధారంగా పట్టుకున్నారు. విచారణలో అతడు బెంగళూరుతో పాటు పలు నగరాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.

దర్యాప్తులో పోలీసులు అతడి వద్ద 181 గ్రాముల బంగారు బిస్కట్లు, 333 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడ్, ఫైర్ గన్‌ను కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అతడు దొంగతనం చేసిన బంగారాన్ని ఫైర్ గన్‌తో కరిగించి బిస్కెట్లుగా మారుస్తూ.. వాటిని సోలాపూర్‌లోని తన ఇంట్లో దాచిపెట్టాడని తేలింది.

స్వామి తండ్రి మరణించడంతో అతని తల్లి రైల్వే శాఖలో ఉద్యోగం పొందినట్లు పోలీసులు తెలిపారు. అతడు కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉండటంతో, చాకచక్యంగా దొంగతనాలు చేసి పోలీసుల కంట పడకుండా ఉండేవాడు. అయితే, ఇప్పుడు అతడి నాటకాలన్నీ అంతమయ్యాయి. పోలీసులు అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసి, ఆయన గత నేర చరిత్రను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.

This post was last modified on February 4, 2025 9:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

2 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

2 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

4 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

5 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

6 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

7 hours ago