రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత సులభం కానున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్స్ చేయడం ఇష్టంలేని వారికీ గూగుల్ మరో అద్భుతమైన AI టూల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. వ్యాపార సంస్థలకు కాల్ చేసి ధరలు, లభ్యత వంటి వివరాలు తెలుసుకోవడం ఎంతో విసుగు కలిగించే పని.
ముఖ్యంగా ఇంట్రోవర్ట్ మనస్తత్వం కలిగిన వారు అవసరమైన సమాచారం కోసం కాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే అసౌకర్యంగా ఫీలవుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ కొత్తగా ‘ఆస్క్ ఫర్ మీ’ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతానికి ఇది గూగుల్ సెర్చ్ ల్యాబ్స్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించబడుతోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. మీరు గూగుల్‌లో నెయిల్ సలోన్, ఆటో రిపేర్ షాప్ వంటి సేవలను వెతికితే ‘Ask for Me’ అనే ఆప్షన్ కనిపించొచ్చు.
దానిపై క్లిక్ చేసి ‘గెట్ స్టార్టెడ్’ ఎంపిక చేయాలి. ఆ తర్వాత, అవసరమైన సేవ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీకు మ్యానిక్యూర్ లేదా ఆయిల్ ఛేంజ్ అవసరమైతే, దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక మీదట మీ పనిని గూగుల్ ఏఐ చేపడుతుంది. గూగుల్ AI స్థానిక వ్యాపారాలకు కాల్ చేసి, ధరలు, అందుబాటు తదితర వివరాలను సేకరించి మీకు ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది. దీంతో, మీరు లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఏకకాలంలో చాలా వ్యాపారాల సమాచారం పొందగలుగుతారు.
ఈ సేవ ప్రస్తుతం కేవలం నెయిల్ సలోన్, ఆటో రిపేర్ షాపులకే పరిమితం అయినప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని వ్యాపార సేవలకు విస్తరించొచ్చు. అయితే, AI కాల్ చేయడాన్ని వ్యాపార సంస్థలు ఎలా స్వీకరిస్తాయనేదానిపై మిశ్రమ అభిప్రాయాలున్నాయి. పలు సంస్థలు అసలు AI కాల్స్‌ని అర్థం చేసుకోలేకపోవచ్చు, మరికొందరు డైరెక్ట్ గా కస్టమర్లతోనే మాట్లాడాలని కోరుకోవచ్చు.
అయినప్పటికీ, ఈ టూల్ వ్యాపార సంస్థలు, కస్టమర్ల సమయాన్ని ఆదా చేసే అవకాశముంది. ప్రస్తుతం గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఇది విజయవంతమైతే, భవిష్యత్తులో మరింత మందికి అందుబాటులోకి తీసుకురావొచ్చు.‘ఆస్క్ ఫర్ మీ’ వ్యాపార ప్రపంచాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి!
This post was last modified on January 31, 2025 10:56 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…