అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఆర్థిక విధానాలను స్పష్టంగా వెల్లడించారు. తాజాగా, బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే బ్రిక్స్ దేశాలు డాలర్ డిమాండ్ ను తట్టుకోలేక కొత్త కరెన్సీని సృష్టించే ఆలోచనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విధంగా చేయకూడదని, లేదా ఏ ఇతర కరెన్సీని డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మద్దతు ఇవ్వకూడదని వారు స్పష్టంగా హామీ ఇవ్వాలని, లేకపోతే 100% టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
అంతేకాకుండా, బ్రిక్స్ దేశాలకు అమెరికాలో వ్యాపారం చేసుకునే అవకాశాలను పూర్తిగా మూసివేస్తామని, వీళ్లు మరో ‘సక్కర్ నేషన్’ (సులువుగా మోసపోయే దేశం) వెతుక్కోవాల్సి వస్తుందని కటువాక్యాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా భారత్‌కు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే బ్రిక్స్‌లో భారత్ కీలకమైన సభ్యదేశం. గత కొంతకాలంగా భారత్ డాలర్ ఆధారిత వ్యవస్థను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
రష్యాతో రూపీ-రూబుల్ లావాదేవీలు, సౌదీతో రుపీ ట్రేడింగ్ చర్చలు, అంతర్జాతీయ లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌పై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతంగా ఉండటంతో, డీ-డాలరైజేషన్ దిశగా భారత్ వెళ్లే ప్రయత్నాలు ట్రంప్ పాలనలో వ్యాపార యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలపై అమెరికా నుంచి భారీగా ఆదాయం వస్తోంది. అమెరికా ప్రతిపాదిత 100% టారిఫ్‌లు విధిస్తే, భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం పడనుంది. ఇప్పటికే ట్రంప్ పాలనలో హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేసిన నేపథ్యంలో, ఈసారి వాణిజ్య ఒత్తిడి పెంచితే, భారత్‌కు అమెరికా మార్కెట్‌లో పోటీ చేయడం మరింత క్లిష్టం కానుంది. అయితే భారత్ పూర్తిగా అమెరికాపై ఆధారపడలేదని, ఇటీవల యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికగానే చూడాలా? లేక వాస్తవంగా అమలయ్యే విధానమా? అనే దానిపై ప్రపంచ ఆర్థిక నిపుణులు చర్చిస్తున్నారు. బ్రిక్స్ దేశాలు తమ ప్రణాళికలను నెమ్మదింపే అవకాశం ఉందని, ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చని అంచనా. భారత్ విషయానికి వస్తే, మోదీ ప్రభుత్వం అమెరికాతో తగిన మధ్యస్థత పాటిస్తూ, ఒకేసారి డీ-డాలరైజేషన్ వైపు కాకుండా, గ్లోబల్ లావాదేవీల్లో సులభతర మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on January 31, 2025 1:21 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…