Trends

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ మరో ఘనత

ఇప్పటికే ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తాజాగా మరోసారి స్పేస్‌వాక్ చేసి కొత్త రికార్డును నమోదు చేశారు. ఆమె రేడియో కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను తొలగించేందుకు స్పేస్‌స్టేషన్ వెలుపలకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మునుపటి వ్యోమగామి పెగ్గీ విట్సన్ స్థిరపరిచిన 60 గంటల 21 నిమిషాల స్పేస్‌వాక్ రికార్డును అధిగమించారు.

సునీతా విలియమ్స్ గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఐఎస్ఎస్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లినా, వ్యోమనౌకలో సాంకేతిక లోపాల వల్ల భూమికి తిరిగి రాలేకపోయారు. అప్పటి నుంచి స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తూ, అక్కడి మరమ్మతు పనులను కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వ్యోమగామి విల్మార్‌తో కలిసి తాజాగా మరోసారి స్పేస్‌వాక్ చేసి మరమ్మతుల పనులను చేపట్టారు.

ఇది సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష ప్రయాణం కాగా, ఆమె ఇప్పటివరకు మొత్తం తొమ్మిది స్పేస్‌వాక్‌లు పూర్తి చేశారు. 2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్ నిర్వహించారు. ఇప్పటి వరకు 50 గంటల 40 నిమిషాల పాటు శూన్య గమనంలో గడిపిన ఆమె, తాజాగా చేసిన స్పేస్‌వాక్‌తో రికార్డు స్థాయిలో అత్యధికంగా అంతరిక్ష నడక చేసిన వ్యోమగాముల జాబితాలో మరో రికార్డ్ కు చేరుకున్నారు.

ప్రస్తుతం నాసా ఆమెను భూమికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలం శూన్య గమనంలో ఉన్న సునీతా భూమిపై అడుగు పెట్టిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on January 31, 2025 12:43 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago