ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేలోని నోబెల్ అవార్డుల కమిటీకి యూరోపియన్ యూనియన్ నుంచి ఓ ప్రతిపాదన అందింది. వాస్తవానికి సామాజిక సేవ చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది. అయితే వృత్తిరీత్యా ఫక్తు బిజినెస్ మ్యాన్ గా వ్యవహరిస్తూ… తనదైన వ్యూహాలతో సాగుతున్న మస్క్ ఈ అవార్డు రేసులోకి రావడం గమనార్హం.
ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ వెన్నుదన్నుగా నిలిచారు. ఎన్నికల వ్యూహ రచనతో పాటుగా ఎన్నికల ప్రచారంలోనూ స్వయంగా పాలుపంచుకున్న మస్క్..,. ట్రంప్ కు మద్దతుగా నిలిచిన వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తానంటూ బహిరంగంగానే ప్రకటించి సంచలనం రేపారు. అయితే మస్క్ వ్యాఖ్యలపై అమెరికా ఎన్నికల నియమావళి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
ఎన్నికల్లో ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టగానే…అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందే మస్క్ ను తన సలహాదారుగా నియమిస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా తాను తీసుకుంటున్న ప్రతి కీలక నిర్ణయాన్ని ముందుగా మస్క్ తో చర్చించిన తర్వాతే ట్రంప్ ముందుకు సాగుతున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా రాజకీయాలు, పాలనా వ్యవస్థలో మస్క్ భవిష్యత్తులో మస్క్ మరింత కీలకంగా వ్యవహరించనున్నారు.
ఇక అదే సమయంలో ఇప్పటికే విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను ఏర్పాటు చేసిన మస్క్…ఆయా దేశాల్లో తన కంపెనీ విస్తరణ కోసం నయా వ్యూహాలను అమలు చేస్తున్నారు. తనకు అమితమైన ఇష్టమున్న అంతరిక్ష రంగంలో కాలిడిన మస్క్…స్పేస్ ఎక్స్ పేరిట ఓ కంపెనీనే తెరిచారు. ఇక గతంలో ట్విట్టర్ ను హస్తగతం చేసుకునేందుకు మస్క్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా చైనా యాప్ టిక్ టాక్ ను కూడా చేజిక్కించుకునేందుకు మస్క్ తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఇదిలా ఉంటే..ప్రపంచవ్యాప్తంగా భాశ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడేందుకు మస్క్ ఎనలేని కృషి చేస్తున్నారంటూ ఇప్పుడు ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ఓ కీలక ప్రకటన చేశారు. మరి ఈ ప్రతిపాదనకు నోబెల్ కమిటీ ఏ మేర ప్రాదాన్యం ఇస్దుందో చూడాలి.
This post was last modified on January 31, 2025 7:45 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…