ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీ రద్దయినట్లు తెలుస్తోంది. ఈవెంట్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించినా, ప్రధాన టీములు ఆలస్యంగా చేరుకునే పరిస్థితి వల్ల PCBకి మరో చిక్కొచ్చింది.
ముఖ్యంగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశమే లేదని తేలిపోయింది. దీంతో, గత ఐసీసీ టోర్నమెంట్లలో నిర్వహించినట్లుగా కెప్టెన్స్ మీట్, గ్రూప్ ఫొటోషూట్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించకుండానే టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత క్రికెట్ బోర్డు (BCCI) ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియన్ టీమ్‌ను పాకిస్థాన్‌కు పంపే ఉద్దేశం లేదని స్పష్టంగా ప్రకటించింది. అందువల్ల, టీమిండియా మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నారు.
ఇది PCBకు పెద్ద ఎదురుదెబ్బ కాగా, ఇప్పుడు ఓపెనింగ్ సెర్మనీ కూడా రద్దవ్వడం మరో సమస్యగా మారింది. అటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా ఆలస్యంగా పాకిస్థాన్ చేరుకోనున్నాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ టీమ్ ఫిబ్రవరి 18న, ఆస్ట్రేలియా టీమ్ ఫిబ్రవరి 19న మాత్రమే రావడం, వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడకుండానే టోర్నీలో అడుగుపెట్టడం గమనార్హం.
ఇక బంగ్లాదేశ్, ఇండియా జట్లు ఫిబ్రవరి 15న దుబాయ్‌లో చేరతాయని తెలుస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రం ముందుగా పాకిస్థాన్ చేరుకుని ఆతిథ్య జట్టుతో కలిసి ట్రై సిరీస్ ఆడతాయి. ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌లో అడుగుపెడుతుంది. కానీ, ప్రధాన టీములైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆలస్యంగా చేరడంతో PCB ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఐసీసీ టోర్నమెంట్లలో ఓపెనింగ్ సెర్మనీ విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. గతంలో జరిగిన వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీలకు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించగా, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా, కెప్టెన్స్ మీట్, ఫొటోషూట్ లాంటి కార్యక్రమాలు కూడా ఈసారి ఉండకపోవడం ఈ టోర్నమెంట్ ఆకర్షణను మరింత తగ్గించనుంది.
పాకిస్థాన్‌లో 29 ఏళ్ల తర్వాత ఐసీసీ మెగా టోర్నీ జరుగుతున్నా, భారత్‌తో పాటు ఇతర పెద్ద జట్లు పూర్తి స్థాయిలో పాల్గొనకపోవడంతో ఈ టోర్నమెంట్ ప్రతిష్టకు గండిపడే అవకాశం ఉంది. PCB ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కొంటుండగా, ఓపెనింగ్ సెర్మనీ కూడా రద్దవ్వడం మరింత సమస్యగా మారింది. చూడాలి మరి, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏ మేరకు విజయవంతమవుతుందో.
This post was last modified on January 31, 2025 7:42 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…